Balakrishna (1)
Balakrishna: హిందూపురం( hindupuram ) మున్సిపాలిటీ టిడిపి కైవసం చేసుకుంది. నాటకీయ పరిణామాల నడుమ తెలుగుదేశం పార్టీకి చిక్కింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనదైన మార్పు రాజకీయం చూపించారు. ఈరోజు జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి రమేష్ కుమార్ విజయం సాధించారు. ఆయనకు ఏకంగా 23 ఓట్లు వచ్చాయి. అయితే వైసిపి అభ్యర్థికి అధికారికంగా 23 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కానీ సింగిల్ డిజిట్ కి ఆ పార్టీ పరిమితం అయ్యింది. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. హిందూపురంలో తనదైన రాజకీయాలు నడిపి మున్సిపాలిటీ టిడిపి ఖాతాలో వేశారు నందమూరి బాలకృష్ణ. దీంతో ఏపీవ్యాప్తంగా మున్సిపాలిటీలు అధికార కూటమికి దక్కే మార్గాన్ని సూచించింది హిందూపురం.
టిడిపికి కంచుకోట హిందూపురం( hindupuram ) నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీనే గెలుస్తోంది. ముఖ్యంగా నందమూరి కుటుంబం ఎక్కువ రోజులు అక్కడ ప్రాతినిధ్యం వహించింది. తొలుత నందమూరి తారక రామారావు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అటు తరువాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం ఎమ్మెల్యే అయ్యారు. 2014లో తొలిసారి పోటీ చేసి గెలిచారు నందమూరి బాలకృష్ణ. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో హిందూపురం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణను ఎలాగైనా ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. బాలకృష్ణ విజయాన్ని ఆపలేదు.
* సర్వశక్తులు వడ్డిన వైసిపి
మునిసిపల్ ఎన్నికల్లో( Municipal Elections ) హిందూపురం మున్సిపాలిటీ కైవసం చేసుకుంది వైసిపి. ఆ పార్టీకి చెందిన ఇంద్రజ మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి వైసిపి ఓ మహిళా అభ్యర్థిని రంగంలోకి దించింది. బాలకృష్ణను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డింది. కానీ ఓడిపోయింది వైసీపీ. అయితే మధ్యలో అధికార మార్కు చూపించి హిందూపురం మున్సిపాలిటీ ఏకపక్షంగా దక్కించుకుంది వైసిపి. కానీ ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో వైసిపి కౌన్సిలర్లు ఒక్కొక్కరు టిడిపిలోకి రావడం ప్రారంభించారు. చివరకు మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ సైతం టిడిపిలో చేరిపోయారు. దీంతో చైర్మన్ ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే తమకు అక్కడ మెజారిటీ ఉందని భావించిన వైసిపి శిబిరాన్ని నిర్వహించింది. ఆ బాధ్యతను మాజీమంత్రి ఉషశ్రీ చరణ్ కు అప్పగించింది హై కమాండ్. కానీ ఆమె పెద్దగా పట్టించుకోలేదు. దీంతో టిడిపి సునాయాసంగా హిందూపురం మున్సిపాలిటీ దక్కించుకోగలిగింది.
* ఆ నలుగురు సైతం హిందూపురం( hindupuram ) మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. అయితే ఇలా చేరిన వారిలో ఓ నలుగురు తిరిగి మళ్లీ వైసీపీ గూటికి వెళ్లిపోయారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ నలుగురు సైతం వైసీపీకి మద్దతు తెలపలేదు. వైసీపీ అభ్యర్థికి ఓటు వేయలేదు. వారు సైతం టిడిపి అభ్యర్థికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యూహం పన్నడంతోనే ఇది సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసలు హిందూపురంలో బాలకృష్ణను లేకుండా చేయాలని వైసిపి భావించింది. కానీ ఇప్పుడు అదే వైసిపి అడ్రస్ గల్లంతు కావడం విశేషం.