https://oktelugu.com/

BalaKrishna : ఎన్టీయార్ కి బాలయ్య చేసిన సహాయం ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరూ జై బాలయ్య అనాల్సిందే…

బాలయ్య, ఎన్టీయార్ ఇద్దరు కూడా మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు కావడం విశేషం...ఇక ఇప్పటికీ వీళ్ల సినిమాలు వస్తున్నాయి అంటే జనాలు మొత్తం అటెన్షన్ ను మెయింటైన్ చేస్తారు...

Written By:
  • Gopi
  • , Updated On : July 29, 2024 / 02:08 PM IST
    Follow us on

    BalaKrishna :  నందమూరి ఫ్యామిలీ లో ఉన్న హీరోల్లో నటసింహం బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీయార్ ఇద్దరు తమదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వారు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరూ స్టార్ హీరోలు కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు, ఎన్టీఆర్ లా మధ్య కొంతవరకైతే విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు బాలయ్య చాలా వరకు అండగా నిలిచిన విషయం మనలో చాలామందికి తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కి ల్యాండ్ విషయంలో చాలా వరకు ఇబ్బందులైతే ఎదురయ్యాయట. ఇక ఆ సమయంలో బాలయ్య బాబు చొరవ తీసుకొని ఎన్టీఆర్ కు రావలసిన భూములను తనకు అప్పగించి హెల్ప్ చేశారనే వార్తలైతే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆ కృతజ్ఞత భావంతోనే బాలకృష్ణతో చాలా రోజుల పాటు మంచి సన్నిహితంగా కూడా మెదిలాడని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

    ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ బయట ఎక్కడో కొన్న భూముల విషయంలో వచ్చిన విభేదాలను బాలకృష్ణ తొలగించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. 2009 ఎలక్షన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ తరపున సపోర్ట్ చేయడమే కాకుండా ఆ పార్టీ తరఫున ప్రచారాన్ని కూడా నిర్వహించాడు. ఇక అదే సమయంలో ఆయన యాక్సిడెంట్ కి కూడా గురైన విషయం మనకు తెలిసిందే…ఇక మొత్తానికైతే అటు బాబాయ్, ఇటు అబ్బాయి ఇద్దరు కూడా చాలా రోజులపాటు చాలా సన్నిహితంగా మెదిలి ఒకరికోసం ఒకరు అన్నట్టుగా నిలిచారు.

    కానీ ఇప్పుడు ఎవరికి వారు సపరేట్ గా ఉంటున్నారు. ఇక ఇలాంటి సమయంలో కూడా వీళ్ళు భారీ సినిమాలు చేస్తు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బాలయ్య బాబు చాలా వరకు హెల్ప్ చేశారు అంటూ ఆయన గురించి చాలా మంది నందమూరి అభిమానులు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఎన్టీయార్ మాత్రం నందమూరి బాలకృష్ణతో కానీ, నారా చంద్రబాబు నాయుడుతో కానీ చాలా వరకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక దానికి తోడుగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయినప్పుడు అతన్ని పరామర్శించడం కానీ, అతనికి సంబంధించిన ఒక ట్వీట్ చేయడం గానీ చేయలేదు. అ

    అందువల్లే వీళ్ళ మధ్య చాలా దూరం అయితే పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే వీళ్లంతా కలిసి ఉంటే చూడాలని నందమూరి అభిమానులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ముందు రాబోయే రోజుల్లో వీళ్లంతా కలిసి కనిపిస్తారేమో చూడాలి… ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ప్రస్తుతం వీళ్లిద్దరూ ఈ రెండు సినిమాలతో భారీ సక్సెస్ ను కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…