Auto Drivers Sevalo Scheme: దసరా అంటేనే వాహన పూజలకు నెలవు. విజయదశమి అంటేనే వాహన కార్మికులకు ప్రధాన పండుగ. అటువంటి పండుగ నాడు ఆటో కార్మికులకు సాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.15,000 జమ చేయనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసింది యంత్రాంగం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. అందుకే వారి విన్నపం మేరకు ఏపీ ప్రభుత్వం ఒక్కో ఆటో డ్రైవర్ ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేసేందుకు నిర్ణయించింది. వైసిపి హయాంలో వాహన మిత్రగా ఉన్న ఈ పథకాన్ని.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే పేరు పెట్టింది. ఇకనుంచి ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున సాయం అందజేయనుంది. అక్టోబర్ రెండు న ఆటో డ్రైవర్ల ఖాతాలో ఈ సాయం జమ కానుంది.
వాహన మిత్ర పేరు మార్పు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వాహన మిత్ర పేరిట ఈ పథకాన్ని అమలు చేశారు. ప్రతి సంవత్సరం పదివేల రూపాయల చొప్పున సాయం అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎటువంటి పథకం ప్రకటించలేదు. కానీ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కావడంతో.. ప్రయాణికులు ఆటోల వైపు చూడడం మానేశారు. దీంతో తమకు ఉపాధి లేకుండా పోయిందన్న ఆందోళన ఆటో డ్రైవర్ల నుంచి వినిపించింది. అందుకే తమకు కూడా సాయం అందించాలని వారు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం ద్వారా సాయం అందించాలని నిర్ణయించారు. గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. తుది జాబితాను సైతం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,10,385 మంది అర్హుల జాబితాను సిద్ధం చేశారు. వీరందరి ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు. ఈ పథకంతో ఏపీ ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడనుంది.
సచివాలయాల్లో జాబితా..
మరోవైపు సచివాలయాల్లో లబ్ధిదారుల పేర్లను ప్రదర్శిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇంకోవైపు ఆటో డ్రైవర్ల సేవలో పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. తమ పేరు ఉందో? లేదో? ఆటో డ్రైవర్లు స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ పథకం స్టేటస్ చెక్ చేయడానికి లాగిన్ అవసరం లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆధార్ కార్డు నెంబర్ తో చెక్ చేసుకోవచ్చు. ఈ లింకును క్లిక్ చేసి పథకం స్టేటస్, లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
– ముందుగా NBM అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
– https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main.Home పేజీలో ‘ application status’ ఎంపిక చేసుకోవాలి.
– scheme drop down లో financial assistant to auto and Maxi cab owners ( auto driver sevalo / Vahana Mitra ) ను ఎంపిక చేసుకోవాలి.
– 12 అంకెల ఆధార్ నెంబర్, క్యాప్చ కోడ్ ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి.. Submit/ check status క్లిక్ చేస్తే చాలు.. వెంటనే స్క్రీన్ పై స్టేటస్ కనిపిస్తుంది.