YCP Party : వైసిపి ఆత్మ రక్షణలో పడిందా? అందుకే ఎదురు దాడి చేస్తుందా? గాలివీడు ఎంపీడీవో పై దాడి ప్రజల్లోకి బలంగా వెళ్లిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎంపీపీ చాంబర్ తాళాలు అడిగితే ఇవ్వని కారణంగా ఎంపీడీవో పై దాడికి పాల్పడ్డారు వైసీపీ నేతలు. అయితే ఈ ఘటన చిలికి చిలికి గాలి వానలా మరి డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీ ఇచ్చేసరికి తీవ్ర రూపం దాల్చింది. వైసిపి ఇంకా అధికారంలో ఉన్నట్టు నేతలు వ్యవహరిస్తుండడాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా బాధిత ఎంపీడీవో దళిత వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో ఆ వర్గాల్లో సైతం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైసిపి నేతల తీరుపై దళిత వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలు పోక వైసిపి ఎదురు దాడి చేస్తుండడం విశేషం.
* జరిగింది ఇది
గాలివీడు ఎంపీపీగా పద్మావతమ్మ ఉన్నారు. ఆమె కొద్ది రోజులుగా ఎంపీపీగా వ్యవహరిస్తున్నారు. ఆమె కుమారుడు సుదర్శన్ రెడ్డి ఎంపీడీవో పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు. వైసీపీలో యాక్టివ్ గా ఉండే సుదర్శన్ రెడ్డి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయ్యారు. ఆమె తల్లి పద్మావతమ్మ అంగన్వాడి కార్యకర్తగా పనిచేసే పదవి విరమణ చేశారు. ఆమె సైతం మరో ప్రాదేశకం నుంచి ఎంపీటీసీ అయ్యారు. అయితే తొలుత సుదర్శన్ రెడ్డి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. కానీ జగన్ తో ఉన్న సన్నిహిత్యం కారణంగా ఆయనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్ ఇచ్చారు. దీంతో ఎంపీపీకి ఆయన రాజీనామా చేయడంతో.. తల్లి పద్మావతమ్మ ఆ పదవిలోకి వచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సుదర్శన రెడ్డి హవా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఎంపీపీ చాంబర్ తాళాలు అడిగారు. అందుకు ఎంపీడీవో నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు. అయితే చట్టాలపై అవగాహన ఉన్న సుదర్శన రెడ్డి సైతం దూకుడుగా వ్యవహరించడంతో వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఏకంగా దళిత ఎంపీడీవో పై దాడి చేయడంతో ఈ కేసు కొత్త మలుపుకు దారితీసింది.
* పవన్ ఎంట్రీ తో మారిన సీన్
అయితే ఎంపీడీవో జవహర్ బాబు పై దాడి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. దాడిని ఖండించడంతోపాటు నేరుగా బాధితుడిని పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అదే సమయంలో దళిత వర్గాల్లో సైతం వైసిపి పట్ల ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. పవన్ సీరియస్ చర్యలకు దిగడంతో డిఫెన్స్ లో పడింది వైసిపి. అందుకే బాధిత ఎంపీడీవో పై లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అయితే ప్రజల్లోకి ఈ విషయం బలంగా వెళ్లడం, దళిత వర్గాల్లో సైతం వైసీపీపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. టిడిపి శ్రేణుల దాడుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చర్యలపై తప్పు పడుతున్నారు. కానీ వైసీపీకి జరగాల్సిన నష్టం పై.. ఆ పార్టీ నేతలు ఒక రకమైన భయమైతే నెలకొంది. ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డి తో పాటు 13 మంది వైసీపీ నేతలు ఇప్పుడు పరారీలో ఉన్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: As opposition to the ysrcp is being expressed among dalit communities the party leaders are counterattacking
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com