Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించిన వీడియోలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. ఆయనపై ప్రభుత్వ ఉద్యోగిని లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదొక రాజకీయ ట్రాప్ అని.. 25 కోట్ల రూపాయలు ఆమె డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో విడుదల చేసింది. అసెంబ్లీ వేదికగానే సదరు మహిళతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడినట్లు వైసీపీ చెబుతోంది. మరోసారి ఇది సంచలన అంశంగా మారింది.
మరోవైపు జనసేన హై కమాండ్ ఈ ఘటనపై ఇప్పటికే స్పందించింది. విచారణకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో ఈ కమిటీకి సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చింది. అయితే అదే సమయంలో బాధిత మహిళ గురించి ఒక్కో ఆసక్తికర వార్త కూడా బయటకు వస్తోంది. ఆమె అబార్షన్, ఇతరత్రా ఆరోపణలపై ఆసుపత్రి వర్గాలతో పాటు సంబంధిత వర్గాలు స్పందిస్తున్నాయి. ఆమె చెప్పిన దాంట్లో నిజాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మీడియా ముందుకు రావడంతో పాటు ప్రతి గంటకు ఒక వీడియో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా అసెంబ్లీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ వీడియో కాల్ చేసిన దృశ్యాలను బయటపెట్టింది సదరు బాధిత మహిళ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దానిని విపరీతంగా ట్రోల్ చేస్తోంది. అసెంబ్లీ నుంచి మహిళకు కుశల ప్రశ్నలు వేస్తూ వీడియో కాల్ చేయడం స్పష్టంగా కనిపించింది. అయితే సదరు మహిళ ట్రాప్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఊహించని విధంగా బాధితురాలు అనేక వీడియోలు బయట పెడుతుండడంతో జనసేన పార్టీలో ఆందోళన మొదలైంది. మున్ముందు ఇలాంటి వీడియోలు మరిన్ని బయటకు వస్తాయన్న ప్రచారం నడుస్తోంది. దీంతో జనసేనలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పై గట్టి చర్చ నడుస్తోంది. అనవసరంగా జనసేన పరువు పోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి జనసేన హై కమాండ్ ఎలాంటి దిద్దుబాటు చర్యలకు దిగుతుందో..