Arav Sridhar Controversy: ఏపీలో( Andhra Pradesh) షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన రైల్వేకోడూరులో జరిగింది. గత కొంతకాలంగా స్థానిక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు చేస్తోంది ఓ మహిళ. ఏకంగా జనసేన నాయకత్వానికి ఆమె అభ్యర్థన చేశారు. పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఘటనపై దర్యాప్తు కూడా చేస్తోంది. అయితే ఎప్పటికప్పుడు మీడియాకు ఆమె వీడియో లు విడుదల చేస్తూ వస్తున్నారు. జనసేన నాయకత్వం నుంచి కానీ.. ప్రభుత్వం నుంచి కానీ అరవ శ్రీధర్ పై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఆమె పలుమార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఆమెతో పాటు సోదరుడిపై జన సేన నేతలు దాడి చేయడం సంచలనంగా మారింది.
* అమరావతి వేడుకల్లో.. అమరావతికి( Amaravathi capital ) చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదానికి పొందిన నేపథ్యంలో వేడుకలకు పిలుపునిచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రైల్వే కోడూరులో వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తో పాటు జనసైనికులు భారీగా వెళ్తున్నారు. అదే సమయంలో అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేసిన మహిళ, ఆమె సోదరుడు గోపి అదే సమయంలో టోల్గేట్ సమీపంలో పూల దుకాణం వద్దకు వచ్చారు. ఆమెను చూడగానే జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆమె వెంట పడ్డారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినలేదు. న్యాయం చేయాలని కోరితే దాడి చేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుండగా తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల లాఠీతో ఆమె వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ గొడవ జరుగుతున్నంత సేపు ఎమ్మెల్యే శ్రీధర్ ఆయన కారులోనే ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
* రిపోర్టర్ పై దాడి
మరోవైపు ఈ ఘటనను చిత్రీకరిస్తున్న వీడియో రిపోర్టర్ పై సైతం జన సైనికులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను డిలీట్ కూడా చేయించారని సమాచారం. బహిరంగ ప్రదేశంలో వందలాదిమంది చూస్తుండగా పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారని వారు విమర్శ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నారు.
View this post on Instagram
