https://oktelugu.com/

AP&TS: తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ ఓపెన్ ఎప్పుడు? సెలవులు పెంచే అవకాశం ఉందా?

శనివారం దసరా పండుగ పూర్తి కావడంతో ఇక స్కూల్ ఓపెన్ అవుతాయని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఫీల్ అవుతున్నారు. ఇంకా కొన్ని రోజులు సెలవులు ఉంటే బాగుండేదని ఫీల్ అవుతున్నారు. శనివారం పండుగ ముగిసిన తర్వాత రోజు ఆదివారం ఎలాగో సెలవు. మరి తర్వాత సోమవారం అసలు స్కూల్ ఉందా? ఓపెన్ అవుతాయా? లేదా? అని చాలామంది విద్యార్ధుల్లో డౌట్ ఉంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 13, 2024 / 04:46 PM IST

    schools reopen

    Follow us on

    AP&TS: తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు అయితే సెలవులకు బాగా ఎంజాయ్ చేశారు. ఆటపాటలతో పిల్లలు అయితే సందడి చేశారు. కానీ శనివారం దసరా పండుగ పూర్తి కావడంతో ఇక స్కూల్ ఓపెన్ అవుతాయని విద్యార్థులు ఫీల్ అవుతున్నారు. ఇంకా కొన్ని రోజులు సెలవులు ఉంటే బాగుండేదని ఫీల్ అవుతున్నారు. శనివారం పండుగ ముగిసిన తర్వాత రోజు ఆదివారం ఎలాగో సెలవు. మరి తర్వాత సోమవారం అసలు స్కూల్ ఉందా? ఓపెన్ అవుతాయా? లేదా? అని చాలామంది విద్యార్ధుల్లో డౌట్ ఉంది. అయితే ఏపీలో ఈ రోజుతో సెలవులు ముగిశాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రమే ఏపీలో స్కూళ్లలకు సెలవులు ఇచ్చారు. తెలంగాణ విద్యార్థులకు రేపు స్కూల్ సెలవు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్కూల్‌కు సెలవులు ఇచ్చారు. పిల్లలకు ఇన్ని రోజులు సెలవులు దొరకడంతో పండుగకి బాగా ఎంజాయ్ చేశారు. మళ్లీ సంక్రాంతి వరకు ఇన్ని సెలవులు ఒక్కసారిగా లేకపోవడంతో అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వెళ్లడం, చుట్టాల ఇంటికి వెళ్లడం చేస్తూ పండుగకి ఎంజాయ్ చేశారు.

     

    ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పడంతో మధ్యలో సోమవారం 14 ఒక్కరోజు స్కూల్ ఉంటుందా? లేకపోతే సెలవు ఉంటుందా? అని తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా డౌట్ పడుతున్నారు. కానీ ఏపీలో రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్ కానున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ వర్షాలు భారీగా కురిస్తే స్కూళ్లకు సెలవు ఇవ్వాలా? వద్దా? అని జిల్లా కలెక్టర్లు నిర్ణయించవచ్చు. అయితే తెలంగాణలో జూనియర్ కాలేజీలు సోమవారం నుంచే ఓపెన్ అవుతాయి. దీంతో కాలేజీ విద్యార్థులు స్కూల్ పిల్లలా మాకు సెలవులు ఇచ్చి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు. ఎందుకంటే స్కూల్ విద్యార్థులకు ఒక రోజు కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. కాలేజీ విద్యార్థులకు ఒక రోజు ముందు ఓపెన్ కావడంతో వెళ్లడానికి ఇష్టం చూపించడం లేదు. ఇంకా పండుగ వాతావరణంలోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. ఇంకో రెండు నుంచి మూడు రోజుల పాటు సెలవులు ఉండాలని అటు కాలేజీ, స్కూల్ విద్యార్థులు ఇద్దరూ కోరుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయిన ప్రభుత్వం చెప్పిన రోజే స్కూల్ ఓపెన్ అవుతాయి. మళ్లీ సెలవులు పెరిగే అవకాశం అయితే లేదు. భారీ వర్షాలు పడితే సెలవులు ప్రకటించే అవకాశ ఉంది.