https://oktelugu.com/

APSRTC: ఆర్టీసీ ప్రయాణికులు అందరికీ ఇదొక గొప్ప గుడ్ న్యూస్

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. దీన్ని పెంచడానికి ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ రీజియన్ అధ్వర్యంలో భారీ డిస్కౌంట్లు ఉండే ఆఫర్ ప్రకటించింది. విజయవాడ నుంచి ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి మార్గాల్లో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వారికి డిస్కౌంట్‌ను ప్రకటించింది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 29, 2024 / 10:34 PM IST

    Apsrtc

    Follow us on

    APSRTC: సాధారణంగా ఎప్పటికప్పుడూ అందరూ ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏవైనా పండుగలు, ఫంక్షన్లు ఉంటే ఏదో విధంగా అయిన కూడా గమ్యస్థానాన్ని చేరుకోవాలని చూస్తారు. తక్కువ ఖర్చుతో ట్రైన్‌కి అయిపోతుంది. కానీ వెంటనే టికెట్స్ దొరకకపోవడం వంటి ఇబ్బందుల వల్ల చాలా మంది ఎక్కవగా బస్సులను ఎంచుకుంటారు. ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. సాధారణ రోజుల్లో రేట్లు తక్కువగానే ఉన్నా.. పండుగలు, వీకెండ్స్ అయితే చెప్పక్కర్లేదు. ఒక్కో టికెట్‌పై భారీగా రేటు పెంచుతారు. ఇలాంటి కారణాల వల్ల చాలా మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ఇష్టపడరు. దీనివల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. దీన్ని పెంచడానికి ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ రీజియన్ అధ్వర్యంలో భారీ డిస్కౌంట్లు ఉండే ఆఫర్ ప్రకటించింది. విజయవాడ నుంచి ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి మార్గాల్లో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వారికి డిస్కౌంట్‌ను ప్రకటించింది.

    ఏపీఎస్‌ఆర్టీసీలో ప్రయాణికులు పూర్తిగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ సీజన్‌తో పోలిస్తే శీతాకాలంలో కాస్త తక్కువగానే ప్రయాణిస్తారు. దీనికి తోడు ఏసీ బస్సులకు అయితే బాగా డిమాండ్ తగ్గింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలపై రాయితీని ప్రకటించింది. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో 1 నుంచి 31 వరకు బస్సుల్లో ప్రయాణించే వారికి 10 నుంచి 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపింది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే ప్రయాణికులు రెండు వైపులా టికెట్లను ఒకేసారి రిజర్వేషన్ చేయించుకోవడం వల్ల 10 శాతం రాయితీ లభిస్తుందని అధికారులు తెలిపారు. సాధారణంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.770 ఉంటుంది. అదే 10 శాతం రాయితీతో అయితే రూ.700 వసూలు చేయనున్నారు.

    సాధారణంగా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే స్లీపర్ బస్సుల్లో అయితే రూ.2170 టికెట్ ఛార్జ్ ఉంటుంది. అదే 20 శాతం రాయితీతో రూ.1770 వసూలు చేయనున్నారు. అయితే ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏపీఎస్‌ఆర్టీసీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే అన్ని బస్సులో సాధారణంగా రూ.1070 టికెట్ ఛార్జ్ వసూలు చేస్తారు. అదే 10 శాతం రాయితీతో అయితే రూ.970 వసూలు చేయనున్నారు. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా డిస్కౌంట్లు ప్రకటించడం వల్ల బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఏపీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి వివిధ మార్గాలకు మొత్తం 75 ఏసీ బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఇందులో వెన్నెల బస్సులు 17, డాల్ఫిన్ క్రూయిజ్ బస్సులు 8, అమరావతి బస్సులు 20, ఇంద్ర బస్సులు 23, మెట్రో లగ్జరీ బస్సులు 7 ఉన్నట్లు తెలుస్తోంది.