https://oktelugu.com/

Group 2 mains : యధాతధంగా గ్రూప్ 2 పరీక్ష.. సీఎం చంద్రబాబు లేఖ బుట్ట దాఖలు.. ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం

ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాసిన ఫలితం లేకపోయింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఏపీపీఎస్సీ మొగ్గుచూపింది.

Written By: , Updated On : February 23, 2025 / 10:41 AM IST
Group 2 mains exams

Group 2 mains exams

Follow us on

Group 2 mains :  ఏపీలో( Andhra Pradesh) తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. అసలు పరీక్ష జరుగుతుందా లేదా అని గందరగోళంలో ఉన్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు పరీక్ష యధా విధంగా జరగనుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మెయిన్స్ పరీక్షకు 92250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. సోషల్ మీడియాలో ఎవరైనా గ్రూప్ 2 పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

* ఏపీ ప్రభుత్వం లేఖ
గ్రూప్ 2 మెయిన్స్( group 2 mains ) పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. రాష్ట్ర తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. మరోవైపు గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. చివరకు గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలన్న ప్రభుత్వ లేఖకు ఏపీపీఎస్సీ కార్యదర్శి తిరిగి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై శనివారం నాడు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయలేమని.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న దృష్ట్యా నిర్ణయం తీసుకోలేమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పినట్టు సమాచారం.

* రోస్టర్ విధానంతో నష్టం..
రోస్టర్ విధానంలో( roster system) అవకాశాలు కోల్పోతామని ఎక్కువమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో మహిళలు, దివ్యాంగులు,మాజీ సైనిక ఉద్యోగులు, క్రీడాకారులకు ప్రత్యేక రాష్ట్ర పాయింట్లను నిర్ధారించడానికి అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ కార్యదర్శికి ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ అంశంపై ప్రస్తుతం కోర్టులో పిటిషన్ పై విచారణ సాగుతోందని.. వచ్చే నెల 11న మరోమారు విచారణ జరగనుందని వెల్లడించింది. అందుకే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఉందని.. అప్పటివరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది ఏపీపీఎస్సీ. దీంతో పరీక్షల నిర్వహణకు సిద్ధపడింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్నాయి.