AP Weather : తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు భారీగా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణ భిన్న పరిస్థితులతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు పిడుగుపాటుకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాజధాని హైదరాబాదులో అయితే గంటన్నర పాటు వర్షం దంచి పుట్టింది. భారీ వర్షం దాటికి చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఏపీలోనూ వర్షాలు అదే మాదిరిగా ఉన్నాయి. దీంతో విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితిలో వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Also Read : అమ్మ నిత్యానందా.. అదొక్కటే అనుకున్నాం.. ఈకళలోనూ ఆరితేరావా?
* పిడుగులతో కూడిన వర్షాలు..
ఏపీలో చాలా జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడ్డాయి. ఈరోజు అల్లూరి( Alluri district), కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు, శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరి కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మాత్రం 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండలు ప్రతాపం చూపుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* భారీ వర్షపాతం నమోదు..
కాగా ఏపీ వ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు పడ్డాయి. కృష్ణాజిల్లా పెద్ద అవుటుపల్లిలో( Krishna district outupilli) 68.9 మిల్లీమీటర్లు, ఆత్కూరులో 39 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా సానిక వరంలో 65.2 మిల్లీమీటర్లు, అన్నమయ్య జిల్లా ములకలచెరువులో 57.7 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా పేరు సామల లో 43.2 mm చొప్పున వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలో 18 ప్రాంతాల్లో 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది.
* ఉష్ణోగ్రతలు అధికమే..
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కూడా అలానే ఉంది. వర్షాలు లేని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలే( highest temperatures ) నమోదయ్యాయి. వైయస్సార్ కడప జిల్లా కమలాపురంలో 39.9 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 39.8, అనకాపల్లి జిల్లా వడ్డాది, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు లో 39.6 డిగ్రీల చొప్పున, పల్నాడు జిల్లా రావిపాడు లో 39.5 డిగ్రీలు, ఏలూరు జిల్లా రాజు పోతేపల్లిలో 39.4° చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకో వైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read : మరో నెల రోజులు ఆసుపత్రిలోనే.. కొడాలి నాని ఆరోగ్యం పై బిగ్ అప్డేట్!