AP Free Bus Losses: ఏ ప్రభుత్వం అయినా.. ఏ రాజకీయ పార్టీ అయినా.. తాము చేసిన పనులు.. తాము ప్రారంభించిన సంక్షేమ పథకాలు ( welfare schemes) గురించి చెప్పుకోవడం అనేది సర్వసాధారణం. అయితే ఇలా చేసుకునే ప్రచారం ఒక్కోసారి మంచి ఫలితం ఇస్తుంది. లేకుంటే వికటిస్తుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కలుగుతుంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పంపలేదు కానీ.. సామాన్య కుటుంబాల్లో మహిళలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరం. దీంతో మహిళల నుంచి సంతృప్తి మాత్రం కనిపిస్తోంది. దీనిపై కూటమినేతలకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు జరుపుతున్నారు.
Also Read: ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం తొలిరోజు.. స్పందన ఎలా ఉందంటే?
వైసిపి అదే ప్రచారం..
అయితే అన్ని రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఆటోలకు ఇబ్బంది కలుగుతోందని.. ఆటో డ్రైవర్లకు గతం మాదిరిగా ఆదుకోవాలని కోరుతోంది. ఒకవైపు ఉచిత ప్రయాణం పై, ఇంకోవైపు ఆటో డ్రైవర్ల ఇబ్బందులపై సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు అన్ని రకాల బస్సుల్లో ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారని.. ఆ హామీ నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే దీనిని తిప్పికొట్టే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి స్త్రీ శక్తి పథకం పై సంబరాలు జరుపుతోంది. చేసిన మంచి చెప్పుకోవడం తప్పులేదు కానీ.. ఏ మాత్రం ఈ పథకం నిర్వహించలేకపోయినా.. ఆర్థిక భారంతో ఆంక్షలు విధించినా భవిష్యత్తులో కూటమికి ఇబ్బందులు తప్పవు.
Also Read: ఉచిత బస్సు ప్రయాణం… కూటమి ప్రభుత్వానికి అదే పెద్ద మైనస్ కానుందా?
బాధిత పార్టీగా బీఆర్ఎస్
తెలంగాణలో కెసిఆర్( KCR) నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ ఇలానే చాలా సంక్షేమ పథకాలపై విపరీతమైన ప్రచారం చేసుకుంది. అంతకు ముందున్న ప్రభుత్వాలు ఏమీ చేయలేదని చెప్పి రాజకీయంగా లబ్ది పొందింది. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత బంధు, కాలేశ్వరం ప్రాజెక్టు గురించి అతిగా గొప్పలు చెప్పుకునేది. ఆ పేరుతోనే ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేది. క్రెడిట్ అడ్వాన్స్ లేదా అడ్వాన్స్ క్రెడిట్ కింద బాగానే లబ్ది పొందింది. అయితే కాల క్రమంలో అవే పథకాలు అదే బిఆర్ఎస్ కి ఇబ్బందికరంగా మారాయి. స్త్రీ శక్తి పథకం విషయంలో తెలుగుదేశం పార్టీకి అటువంటి ఇబ్బందులే రేపు కలగవచ్చు. అందుకే వీలైనంతవరకు స్త్రీ శక్తి పథకం పై ఈ సంబరాలు, పెద్ద పెద్ద ప్రకటనలు మానుకుంటే మంచిది. ఇప్పటికే ఈ పథకం పై విషప్రచారం చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూనే ఉంది. అందుకే ఈ పథకంలో ఎదురయ్యే ఇబ్బందులను సరిచేసి అమలు చేస్తే ప్రజలు గుర్తిస్తారు కూడా.