AP SSC Results 2025 : ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు( 10th results ) విడుదలకు సమయం ఆసన్నమైంది. రేపు ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది ఏపీ పాఠశాల విద్యాశాఖ. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది. అటు తరువాత మూల్యాంకనం, కంప్యూటరీకరణ, ఇతర పనులు పూర్తిచేసుకుని ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈసారి వినూత్నంగా వాట్సాప్ లోను ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ఆన్లైన్లో విడుదల చేసే ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లోనూ అందుబాటులో ఉండబోతున్నాయి. వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో అధికారులు తాజాగా వెల్లడించారు.
* సజావుగా పరీక్షలు..
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు( 10th class exams ) రాశారు. మార్చి 17 నుంచి 30 వరకు పరీక్షలు జరిగాయి. తొలిసారిగా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ల జారీ ప్రక్రియ జరిగింది. గతంలో మాల్ ప్రాక్టీస్ ఘటనల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమయింది. పదో తరగతి పరీక్షలను సజావుగా పూర్తి చేయగలిగింది. అయితే మూల్యాంకనం ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేసింది. అనంతరం ఫలితాల కంప్యూటరీకరణ కూడా శరవేగంగా పూర్తి చేయగలిగింది. ఫలితాలను ఆన్లైన్, వాట్సాప్ లో అప్లోడ్ చేసి విద్యార్థులకు రేపు అందుబాటులోకి తెస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఉత్కంఠ కనిపిస్తోంది.
* ఆన్లైన్ తో పాటు వాట్సాప్ లో
పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను ఆన్లైన్ తో పాటు వాట్సాప్ లో( WhatsApp) కూడా విడుదల చేయనున్నారు. ఆన్లైన్ కు సంబంధించి https://bse.ap.gov.in..https://apopenschool.ap.gov.in వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక వాట్సాప్ నకు సంబంధించి మనమిత్ర, LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాట్సాప్ లో 9552300009 నంబర్కు hi అని మెసేజ్ పంపి.. అందులో ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలు ఆప్షన్ ఎంచుకోవాలి. వారి రూల్ నెంబర్ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలు పిడిఎఫ్ కాపీ రూపంలో పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు వారి పాఠశాల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లీప్ మొబైల్ యాప్ లో ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ ల ద్వారా ఫలితాలు పొందే సౌలభ్యం ఉంది.
Also Read : ఏపీ ఎస్‌ఎస్సీ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్.. ఒక రోజు ఆలస్యం..