AP SSC Exams : ఏపీలో( Andhra Pradesh) పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఇటువంటి అవాంతరాలు, వైఫల్యాలు ఎదురు కాకుండా ఏర్పాట్లు చేయగలిగింది. గతంలో పదో తరగతి పరీక్షల సమయంలో లీకేజీ అంశం బయటపడింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అందుకే అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్తలు పడింది ప్రభుత్వం. పగడ్బంది ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియా ప్రచారం పై కూడా నిఘా పెట్టింది. పదో తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలు లీకేజీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే గట్టిగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Also Read : విద్యార్థులు చదవడం లేదని తనను తాను కొట్టుకున్న టీచర్.. వైరల్ వీడియో
పక్కాగా ఏర్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా( state wide ) ఆరు లక్షల 50వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారికోసం 3450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిఘా నడుమ పరీక్షలు జరగనున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతి లేదు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాల ప్రాంగణంలో జిరాక్స్ షాపులతోపాటు మరికొన్ని వాటిపై నిషేధం విధించారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణకు అధికారుల బృందాన్ని నియమించారు.
* ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..
మరోవైపు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ( APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షకు హాజరయ్యే వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. ఉదయం పరీక్షకు హాజరయ్యే వారు ఆర్టీసీ బస్సుల్లో కేంద్రానికి చేరుకోవచ్చు. పరీక్ష రాసిన వారు సాయంత్రం బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందవచ్చు. విద్యార్థులు తమ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు చూపిస్తే చాలు. ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు. ఎండల తీవ్రతతో పాటు సకాలంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఉద్దేశంతోనే ఈ ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించినట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు.. ఏప్రిల్ ఒకటి వరకు కొనసాగనున్నాయి.
Also Read : విద్యార్థులు చదవట్లేదని.. హెచ్ఎం ఏం చేశారో తెలుసా? లోకేష్ స్ట్రాంగ్ రియాక్షన్!