AP population growth: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య తరచుగా పిల్లల్ని కనండి అని పిలుపునిస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా ఇదే విషయం చెప్పారు. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాను కృషి చేశాను అన్నారు. ఇప్పుడు నేనే చెప్తున్నా పిల్లల్ని కనండి అని పిలుపునిచ్చారు. గతంలో కుటుంబ నియంత్రణ గురించి తీసుకున్న స్థితిని గుర్తుచేస్తూ ఇప్పుడు అదే సందేశాన్ని ఇవ్వడం వివాదానికి గురైంది.
ముగ్గురు ఉంటే 30 వేలు..
చంద్రబాబు తాజాగా పిల్లలు కనడానికి ప్రోత్సాహకాలు ప్రకటించారు . ముగ్గురుని కంటే 30 వేల రూపాయలు నలుగురుని కంటే 40 వేల రూపాయలు ఇస్తానని ఉత్తరంగా పర్యటనలు ప్రకటించారు. ఈ విధమైన ప్రతిపాదనలు పరస్పర విమర్శలకు కారణమయ్యాయి.
దేశంలో జనాభా పరిస్థితి..
మన దేశంలో జనాభా ఇప్పటికే సుమారు 140 కోట్ల పైగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెంపు అవసరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనాభా కారణంగా ఇప్పటికే మన దేశంలో వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రజలకు పాలకులు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. మంచి విద్య అందడం లేదు. ఆసుపత్రుల కొరత ఉంది. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. సంపద కూడా కొందరి వద్దనే ఉంటుంది. ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి.
చదరపు కిలోమీటర్ కు 480 మంది పైనే
చదరపు కిలోమీటరుకు కనిపించే జనసాంద్రత భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది, ఇది మౌలిక సదుపాయాలపై భారం పెంచుతుంది. రవాణా, ఆరోగ్య, విద్య, నీటి సరఫరా వంటి సేవల అందుబాటును ప్రస్తుత జనాభా కూడా కష్టపడి తీర్చుకుంటోంది. అంతకంటే ఎక్కువ జనాభా పెరగడం పరిస్థితిని మరింత యంత్రంగా మార్చే అవకాశం ఉంది. అమెరికాలో చదరపు కిలోమీటర్ కు 33 మంది, చైనాలో చదరపు కిలోమీటర్ కు 150 మంది ఉన్నారు. మనదేశంలో కూడా ఫెర్టిలిటీ రేటు తగ్గుతుంది. కానీ జనాభా పెంపు ఇప్పట్లో అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో 310 మంది..
ఆంధ్రప్రదేశ్‌లో జనాభా 5 కోట్లకు పైగా ఉంది. ఇది దక్షిణ కొరియాతో సమానం. దక్షిణ కొరియా ప్రపంచంలో చాలా మెరుగైన అభివృద్ధి చెందిన దేశం. ఆంధ్రప్రదేశ్లో చాలావరకు మౌలిక సదుపాయాల లేవు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో చివరి స్థానంలో ఉంది. జిడిపి పెంపు ప్రజలకు మెరుగైన జీవనం కల్పించడంపై దృష్టి పెట్టాల్సిన తరుణంలో జనాభా పెంపుకు పిలుపునివ్వడం విమర్శలకు తావిస్తోంది.
చంద్రబాబు జనాభా పెంపు గురించి ప్రజలను ప్రోత్సహించడం కన్నా ముందు సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అజీర్ణంతో బాధపడుతున్న వ్యక్తి ఆకలితో ఉన్నవాడిని ఒకప్పుడు తినమని సూచించినట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అధిక జనాభా సూచన రాజకీయంగా రాకుండా వాస్తవ సమస్యల్ని మరింత పెంచే ప్రమాదం ఉంది.