Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేష్( Nara Lokesh) కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు వెళ్లారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్సులతో కలిసి కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారితో సెల్ఫీ తీసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోను టిడిపి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కుటుంబ సమేతంగా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు నారా లోకేష్ దంపతులు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వారణాసిలోని కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* ఈ సాయంత్రానికి విజయవాడకు..
ప్రస్తుతం కుంభమేళాలో( Kumbh Mela) ఉన్న నారా లోకేష్ కుటుంబం కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించనుంది. ప్రత్యేక పూజల అనంతరం విశాలాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు. మరోవైపు కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలి వెళ్తున్నారు.
* ఈనెల 26 వరకు..
ఈనెల 26 వరకు మహా కుంభమేళా( Mahakumbh Mela) కొనసాగనుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మన దేశం వారే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళాకు సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కి వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.