AP Inter Results 2026: ఏపీలో( Andhra Pradesh) ఇంటర్ ఫలితాలు ఈరోజు ప్రకటించనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలను https://resultsble.ap.gov.in ద్వారా పొందవచ్చు. మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాల విడుదల పై ట్వీట్ చేశారు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మరోవైపు https:///www.manabadi.co.in/ వెబ్సైట్ ద్వారా కూడా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు.
* ప్రత్యేక వెబ్సైట్లో ఫలితాలు..
విద్యార్థులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు ఈ వెబ్సైట్లను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలు విడుదల సమయంలో వెబ్సైట్ సర్వర్లపై భారం ఎక్కువగా ఉండనుంది. అందుకే విద్యార్థులు ఓపికతో ఉండాలని. ఈ ఏడాది ఇంటర్ విద్యలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ మార్పులు కారణంగా ఇంటర్ ఫస్టియర్ లో అదనంగా ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టు మార్కులను విడిగా ఇస్తారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ఇంటర్లో ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల రోజులు పట్టింది. మూల్యాంకనం కూడా ఆలస్యం అయ్యింది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. అక్కడితో పోల్చుకుంటే దాదాపు మూడు రోజుల ఆలస్యం జరిగింది ఏపీలో.
* పదిన్నర లక్షల మందికి పైగా..
ఈ ఏడాది ఏపీలో ఇంటర్ ఫస్టియర్ 5.31 లక్షలు, సెకండ్ ఇయర్ లో 5.26 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ పరీక్షలు ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు కొనసాగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం మార్చి 21 నుంచి మొదలయ్యాయి. ఏప్రిల్ 14 తో పూర్తయ్యాయి. అక్కడకు ఒక్క రోజులోనే ఫలితాల విడుదలకు అధికారులు వేగవంతంగా ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. మరికొద్ది సమయంలోనే ఇంటర్ ఫలితాలను వెల్లడించునున్నారు ఇంటర్ బోర్డు అధికారులు.
