Homeఆంధ్రప్రదేశ్‌Heavy Rain Alert To AP: ఏపీలో ఆ జిల్లాలకు హై అలెర్ట్.. భారీ హెచ్చరికలు!

Heavy Rain Alert To AP: ఏపీలో ఆ జిల్లాలకు హై అలెర్ట్.. భారీ హెచ్చరికలు!

Heavy Rain Alert To AP: ఏపీకి సూపర్ కూల్ న్యూస్. ఎండలు మండిపోతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతం గగనతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఆ సమయంలో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని చెప్పుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి అనుకొని ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది చురుగ్గా కొనసాగుతుండడంతోనే ఏపీలో వర్షాలు కురవనున్నాయి.

సమ్మర్ లో కూల్ కూల్..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల కు పైగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్ష సూచన రావడం నిజంగా శుభపరిణామం. ఉత్తరాంధ్రతో పాటు చత్తీస్గడ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఈ ద్రోణి విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈరోజు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడం ఖాయమని చెబుతోంది వాతావరణ శాఖ. అయితే ఉరుములతో పాటు మెరుపులు కూడా ఉంటాయని హెచ్చరిస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని కూడా చెబుతోంది.

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో కూడా తేలికపాటి జల్లులు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు లేకపోలేదు. రాయలసీమ ప్రాంతంలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కార్మికులు చెట్లతో పాటు టవర్ల కింద ఉండవద్దు అని సూచిస్తుంది. బలమైన గాలులు వీయడంతో చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది విపత్తుల నిర్వహణ సంస్థ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version