Homeఆంధ్రప్రదేశ్‌Husband and Wife Govt Jobs: గ్రూప్‌–2 డబుల్‌ విజయం.. తాడిపత్రి దంపతులు ఎంతోమందికి ఆదర్శం!

Husband and Wife Govt Jobs: గ్రూప్‌–2 డబుల్‌ విజయం.. తాడిపత్రి దంపతులు ఎంతోమందికి ఆదర్శం!

Husband and Wife Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌–2 ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు మూడేళ్ల తర్వాత నియామక ప్రక్రియను ఏపీపీఎస్సీ పూర్తి చేసింది. గ్రూప్‌ 2 తుది ఎంపిక జాబితాను జనవరి 27(మంగళవారం) రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాల భర్తీకి 2023 డిసెంబరు 7న నోటిఫికేషన్‌ జారీ చేయగా మూడేళ్ల నుంచి గ్రూప్‌ 2 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ప్రహసనంగా సాగింది. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ తర్వాత తుది ఎంపిక ప్రక్రియ అడుగున పడింది. 891 మంది జాబితాలో ఫలితాలు విడుదల చేసింది. ఇందులో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు సాధించి సంచలనం సృష్టించారు.

ఒకరు సబ్‌ రిజిస్ట్రార్‌.. ఒకరు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌
గ్రూప్‌–2 పరీక్షల్లో అనంతపురం తాడిపత్రి జిల్లా భార్యాభర్తలు వినీత–హేమచంద్ర చరిత్ర సృష్టించారు. వినీత సబ్‌–రిజిస్ట్రార్‌ పదవికి, హేమచంద్ర ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థానానికి ఎంపికయ్యారు. వీరు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నప్పుడు నోటిఫికేషన్‌ వచ్చింది. ఇద్దరూ జాబ్‌కు రిజైన్‌ చేసి గ్రూప్‌–2 సాధించాలనే లక్ష్యంతో సన్నద్ధమయ్యారు. ఈ నిర్ణయం ఫలితం ఇప్పుడు డబుల్‌ ఎంపికగా మారింది. వారి కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేసింది.

పోటీ పరీక్షల్లో జంటల సక్సెస్‌..
సాధారణంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, అక్క తమ్ముడు, అన్న చెల్లెలు ఉద్యోగాలు సాధించడం చూస్తుంటా. కానీ తాజాగా ఏపీ గ్రూప్‌–2 ఫలితాల్లో దంపతులు లక్ష్యం నిర్దేశించుకుని చదివి సక్సెస్‌ అయ్యారు. ఈ విజయాలు పోటీ పరీక్షల్లో మానసిక సపోర్ట్‌ ప్రాముఖ్యతను చూపిస్తాయి. హై–ప్రెషర్‌ జాబ్‌ల నుంచి మార్పు చేసి స్థిరత్వం పొందడం యువతకు మోడల్‌. గ్రూప్‌–2 ఫలితాలు లక్షలాది అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలిచారు. భవిష్యత్‌ నోటిఫికేషన్‌లకు మార్గదర్శకంగా మారతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular