Homeఆంధ్రప్రదేశ్‌AP Graduates MLC : ఉత్తరాంధ్రలో కూటమికి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూలత.. అభ్యర్థి ఓటమి!

AP Graduates MLC : ఉత్తరాంధ్రలో కూటమికి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూలత.. అభ్యర్థి ఓటమి!

AP Graduates MLC :  ఏపీలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ( Andhra Pradesh graduates MLC )ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తో పాటు ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం అయింది. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాస్ నాయుడు విజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక కావడం ఇది మూడోసారి. తన సమీప ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకల రఘువర్మపై ఆయన విజయం సాధించారు. రఘువర్మ సిట్టింగ్ ఎమ్మెల్సీ. గత ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు పై విజయం సాధించిన రఘువర్మ.. ఈసారి ఆయన చేతుల్లోనే ఓడిపోవడం విశేషం.

Also Read : మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో వారికే ఛాన్స్.. విశ్లేషకుల అభిప్రాయం అదే!

* ఇద్దరూ విజయనగరం వాసులే..
ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు ది( gadhe shrinivasalan Naidu ) ఉమ్మడి విజయనగరం జిల్లా. రఘువర్మది సైతం అదే జిల్లా కావడం విశేషం. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన శ్రీనివాసులు నాయుడు ఉపాధ్యాయ సంఘాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. ఈ క్రమంలో ఆయన పిఆర్టియు లో చేరారు. అనతి కాలంలోనే జిల్లా బాధ్యుడిగా మారారు. సంఘ రాష్ట్ర కార్యవర్గంలో కూడా పని చేశారు.

* శాసనమండలి పునరుద్ధరణ తర్వాత
వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) సీఎం అయిన తర్వాత శాసనమండలిని విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారిగా 2007లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఆ సమయంలో పిఆర్టియు అభ్యర్థిగా పోటీ చేశారు గాదె శ్రీనివాసులు నాయుడు. ఏపీటీఎఫ్ అభ్యర్థి సింహాద్రప్పడు పై విజయం సాధించారు. 2013లో సైతం అదే అభ్యర్థి పై విజయం సాధించారు శ్రీనివాసులు నాయుడు. 2019లో మాత్రం ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ చేతిలో శ్రీనివాసులు నాయుడు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మాత్రం అదే రఘువర్మపై శ్రీనివాసులు నాయుడు విజయం సాధించి సత్తా చాటుకున్నారు.

* టిడిపి కూటమికి షాక్
గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు టిడిపి కూటమికి ( TDP Alliance )షాక్ కు గురిచేసింది. ఎందుకంటే ఏపీపీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. టిడిపి కూటమి నేతలు ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. రఘువర్మ గెలుపు కోసం పనిచేశారు. కానీ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులు గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు తెలిపారు. కూటమికి షాక్ ఇచ్చినట్లు అయింది. శ్రీనివాసుల నాయుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఈ సందర్భంగా గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు.

Also Read : ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఫిక్స్.. చంద్రబాబుకు పవన్ కీలక సూచన!*

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version