AP government Women Welfare plan : అయినా ప్రతి కుటుంబానికి రేషన్ సరుకుల బదులుగా రూ.2000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ నగదు వలన పేద కుటుంబాలు ప్రతినిలా తమకు అవసరమైన నిత్యవసర సరుకులను కొనుక్కోగలుగుతారని ఆయన లేఖలో తెలిపారు. ఆయన చేసిన ఈ ప్రతిపాదన పేదల జీవితాలలో చాలా మార్పును తీసుకుని వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బియ్యం, ఇతర ధాన్యాలను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేందుకు రెడీగా ఉంది. గతంలో ఉన్న ఎండియూ వాహనాలను ప్రభుత్వం రద్దు చేసి రేషన్ షాపుల ద్వారానే రేషన్ సరుకులను అందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి ఈ క్రమంలో మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య ఒక ముఖ్యమైన సలహాను ఇచ్చారు. అయినా లేఖలో రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ సరుకులకు బదులుగా ప్రతినెలా 2000 రూపాయలు నగదు ఇస్తే బాగుంటుంది అని ప్రతిపాదన ఇచ్చారు. లేఖలో మాజీ ఎంపీ రేషన్ పంపిణీ తో పాటుగా కొన్ని మార్పులను ఈ విధానంలో తీసుకొని రావాల్సిందిగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో మహిళ యాజమానికి రేషన్ సరుకులకు బదులుగా రూ.2000 రూపాయలు నగదు ఇవ్వాలని మాజీ ఎంపీ సూచించారు. ఈ విధంగా వాళ్లకు నగదు అందజేస్తే ప్రతినెలా వాళ్ళు తమకు కావాల్సిన నిత్యవసర సరుకులను కొనుగోలు చేసేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. లేఖలో మాజీ ఎంపీ నిరుపేద కడుపు నింపడం ద్వారా ఆకలి తీర్చడం ప్రభుత్వం ముఖ్యమైన లక్ష్యం కావాలనే ధ్యేయంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు పేద కుటుంబాలకు కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందజేసే ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీ రామారావు గారు పేదోళ్ల పెన్నిధి అనే ప్రశంసలను దేశవ్యాప్తంగా అందుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు రేషన్ ద్వారా ఉచిత బియ్యం అనేక రూపాలు దిద్దుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
తెలుగుదేశం పాలనలో ఉన్న సమయంలో 2014 నుంచి 2019 వరకు చౌక ధర రేషన్ షాపుల ద్వారా అర్హులైన వాళ్లందరికీ రేషన్ సరుకులను పంపిణీ చేసేవారు. అలాగే వైఎస్ఆర్సిపి పాలనలో 2019 నుంచి 2024 వరకు ఇంటింటికి ఉచిత బియ్యం తో వాహనాల ద్వారా సరుకులను పేదవారికి అందజేసేవారు. వాహనాల ద్వారా ప్రస్తుతం అందుతున్న ఈ విధానాన్ని మారుస్తూ కూటమి ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి చౌక ధరల రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు రెడీగా ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధులకు మరియు వికలాంగులకు ఇంటింటికి రేషన్ సప్లై చేస్తున్నారు.