Homeఆంధ్రప్రదేశ్‌DWCRA Loans : ఇంటిపైనే కరెంట్.. ఏపీలో డ్వాక్రా మహిళలకు బిగ్ ఆఫర్.. వెంటనే దరఖాస్తు...

DWCRA Loans : ఇంటిపైనే కరెంట్.. ఏపీలో డ్వాక్రా మహిళలకు బిగ్ ఆఫర్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!*

DWCRA Loans :  ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వర్తింపజేస్తోంది. పీఎం సూర్య ఘర్ యోజన కింద డ్వాక్రా మహిళలకు ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు సామర్థ్యాన్ని బట్టి వారికి రాయితీ అందించేందుకు సిద్ధపడుతోంది. పేద ప్రజలపై విద్యుత్ భారం తగ్గించే దిశగా ఈ చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి సోలార్ వెలుగులను అందించాలని చూస్తోంది. సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎస్సీలు, ఎస్ టి లకు పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీలు అందిస్తోంది. ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది.

* కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు
రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. విడతల వారీగా డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ లను అమర్చాలని ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా తొలి దశలో లక్ష మంది ఇళ్లపై అమర్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సెర్ఫ్ అధికారులు సోలార్ ద్వారా కలిగే ప్రయోజనాలను మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే మహిళల పేర్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో.. సోలార్ ద్వారా కొంత భారం తగ్గే అవకాశం ఉంది. మిగులు విద్యుత్ ను సైతం సంస్థలు కొనుగోలు చేసి పరిస్థితి కనిపిస్తుండడంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.

* 80 వేల మంది అంగీకారం
రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది వరకు ఈ పథకం ఉపయోగించేందుకు తమ అంగీకారం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 700 మంది సోలార్ రూప్ టాప్ లను పెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే అందులో 400 మంది డ్వాక్రా మహిళలే ఉండడం విశేషం. అందుకే డ్వాక్రా మహిళలను ఒప్పించి సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్యగ్రహ యోజన గృహ వినియోగదారులకు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకంలో భాగంగా మూడు రకాల కెపాసిటీతో సోలార్ రూఫ్ ఏర్పాటు చేసేందుకు రాయితీ అందిస్తున్నారు.
* ఒక కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్ వ్యయం రూ.70 వేలు ఉంటే.. అందులో రూ.30 వేల రాయితీ లభిస్తుంది.
* రెండు కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్ రూ. 1.40 లక్షలు కాగా.. రాయితీ రూ.60000 ఉంటుంది.
* మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ ఏర్పాటు కోసం వ్యయం రూ. 1.95 లక్షలు కాగా.. రాయితీ రూ. 78 వేలు వస్తుంది.

* నేరుగా రుణం
పీఎం సూర్యగ్రహ యోజన పథకం కింద లబ్ధిదారుడు 10% వాటా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని ఏడు శాతం వడ్డీ పై బ్యాంకుల ద్వారా రుణం ఇస్తారు. ఈ రుణాన్ని అందించే బాధ్యత గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులది. ఒకవేళ లబ్ధిదారులు 10 శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఆ మొత్తాన్ని బ్యాంకు, శ్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందిస్తారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version