AP Government : మనదేశంలో పౌరసత్వం గుర్తింపునకు ఆధార్ కార్డు( Aadhar card) కీలకం. ఈ దేశ పౌరుడిగా గుర్తింపు పొందాలంటే ఆధార్ నమోదు తప్పనిసరి. అందుకే పిల్లలకు సైతం బ్లూ కలర్ ఆధార్ కార్డు జారీ చేస్తుంటారు. దీనినే బాలల ఆధార్ అని కూడా పిలుస్తుంటారు. దీనికి పిల్లల బయోమెట్రిక్ అవసరం లేదు. కేవలం పేరు, ఫోటో, తల్లిదండ్రుల వివరాలు వంటి ప్రాథమిక సమాచారం ఉంటే సరిపోతుంది. ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్ వివరాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా రోజులుగా పిల్లల ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ జరగడం లేదు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఆధార్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11.65 లక్షల మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ రేపటి నుంచి మంజూరు చేసేందుకు నిర్ణయించింది.
* పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పిల్లల డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు, పాస్ ఫోటోలు అవసరం ఉంటుంది
* ఆధార్ రిజిస్ట్రేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. అందులో తల్లిదండ్రుల ఆధార్ నెంబర్లు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ సారాన్ని యుఐడిఏఐ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
* తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను ఆధార్ నెంబర్కు అనుసంధానిస్తారు. అందుకే ఖచ్చితమైన ఫోన్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది.
* మీరు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించి ఒక ఐడి ఇస్తారు.
* 60 రోజుల్లో మీ పిల్లల ఆధార్ కార్డు జారీ అవుతుంది.
* ఈ బ్లూ ఆధార్ కార్డు ( blue Aadhar card ) పూర్తిగా ఉచితం. ఎటువంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు.
* కొద్దిరోజులుగా ఎదురుచూపు..
గత కొద్దిరోజులుగా ఆధార్ కార్డుల జారీ( Aadhar cards issue ) ప్రక్రియ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు రావడంతో స్పందించింది. రేపటి నుంచి ఆధార్ కార్డుల జారీకి నిర్ణయించింది. దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఆధార్ కార్డు కేంద్రాలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు కూడా వెల్లడించింది. లక్షలాది మందికి ఆధార్ లేకపోవడంతో.. నేటి నుంచి కేంద్రాలు మరింత కిటకిటలాడే అవకాశం ఉంది.