Jagan Mohan Reddy: రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి. అవకాశం దొరికినప్పుడు ఆ సందర్భాన్ని వాడుకోవాలి. పొలిటికల్ గా మైలేజ్ సాధించాలి. దీనిని ఎవరూ కాదనరు. కానీ అవకాశం లేని సందర్భంలో కూడా రాజకీయాలు చేయడం.. రాజకీయాల కోసం వాటిని వాడుకోవడం అత్యంత నీచం.
ప్రజా సమస్యల పట్ల పోరాడాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్ష పార్టీ మీద ఉంటుంది. కానీ ఏపీలో ఇందుకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికల్లో అక్కడ కూటమి జోరు ముందు వైసిపి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోవలసిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది.. ఏపీలో కూటమి ప్రభుత్వానికి సమాంతరంగా మరో పార్టీ లేదు కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ అక్కడ తుడిచి పెట్టుకుని పోయింది కాబట్టి.. వైసిపి నే అనధికారికంగా ప్రతిపక్ష హోదాలో ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య రైతుల సమస్యల మీద ధర్నాలు చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక అనధికారిక ప్రతిపక్ష నాయకుడిగా అది ఆయనకు లభించిన గౌరవం. ఆయన ఆ పని చేయాలి కూడా.. కాకపోతే ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని చెప్పి ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేస్తే జనం అసలు సహించరు.
ప్రస్తుతం మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికీ ఇరాన్ హార్మోజ్ జలసంది విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ జల సంధి మీదుగా సరుకు రవాణా కావడం లేదు. యుద్ధం నిలిపివేకు సంబంధించిన చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. కేవలం మన దేశం మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు మధ్య ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ ముడి చమురు ధర పెరిగింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తగిన ఇంధన నిల్వలు ఉన్న నేపథ్యంలో కంపెనీలు కూడా పెద్దగా రేట్లు పెంచలేదు. అయితే కమర్షియల్ డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో.. మిగతా డీజిల్ కు డిమాండ్ పెరిగింది. పైగా ఆయిల్ కంపెనీలు సప్లై తగ్గించాయి. దీంతో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బంకుల వద్ద ప్రజల క్యూలు కడుతున్నారు. ఇదే క్రమంలో పానిక్ బయింగ్ పరిస్థితి ఏర్పడింది. ఇది దేశం మొత్తం మీద ఉంది.
ఈ పరిస్థితికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని ట్విట్టర్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పైగా ఒక వీడియోను విడుదల చేశారు. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా విపత్కర పరిస్థితి ఉంటే చంద్రబాబు ఏం చేస్తారు.. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల ఏపీలో ఇంధన కొరత ఏర్పడిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం ఎంతవరకు న్యాయం.. అసలు ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం అవసరమా.. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు చేస్తారా.. ఇప్పుడు ఇవే ప్రశ్నలను కూటమి నేతలు సంధిస్తున్నారు.. ఇప్పటికైనా జగన్ తను తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
.@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది.
తాజాగా ఆ… pic.twitter.com/xLLCXcFuHr
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 27, 2026
