spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Free Electricity Scheme: ఏపీలో ఉచిత విద్యుత్.. కూటమి ప్రభుత్వం సంచలనం

AP Free Electricity Scheme: ఏపీలో ఉచిత విద్యుత్.. కూటమి ప్రభుత్వం సంచలనం

AP Free Electricity Scheme: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు నుంచి వారికి ఉచిత విద్యుత్ అందించనుంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు చొప్పున ఉచితంగా అందించనుంది. చేనేత పనిలో కరెంట్ వినియోగం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన చేనేత కార్మికులందరికీ ఈ ఉచిత పథకాన్ని వర్తింపజేసింది ప్రభుత్వం. అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చుతున్నారు. దీనిపై చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!

* లక్షల కుటుంబాలకు లబ్ధి..
ప్రభుత్వ తాజా నిర్ణయంతో 1.04 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. దీని ద్వారా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా అందించనున్నారు. ఈ నిర్ణయంతో ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు అవుతుందన్నది అంచనా. ఎన్నికల్లో ఇచ్చిన హామీను నెరవేర్చినట్లు అవుతుందని కూటమి నేతలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 93 వేల మగ్గాలు, 10, 534 మరమగ్గాలకు ఉచిత విద్యుత్ అవకాశం కలగనుంది. ఈ పథకం అమలు ద్వారా మగ్గానికి నెలకు రూ.720, ఏడాదికి రూ.8640.. మరమగ్గాలకు నెలకు రూ.1800, ఏడాదికి రూ.21,600 లబ్ది కలగనుంది.

* టిడిపి నేతన్నల పక్షం..
ఆది నుంచి టిడిపి చేనేత కార్మికుల( waiverse ) విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోంది. ఎన్టీఆర్ కూడు-గూడు- గుడ్డ నినాదంతో చేనేతరంగానికి అండగా నిలిచారు. ఇప్పుడు ప్రతి నేతన్న గౌరవప్రదమైన జీవితం సాగించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే 92,724 మంది చేనేత కార్మికులకు 4 వేల రూపాయల చొప్పున ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నారు. వాస్తవానికి చేనేత గిట్టుబాటు కావడం లేదు. చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి వైపు వెళ్ళిపోయారు. కానీ ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా వారికి కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఈరోజు నుంచి ఈ ఉచిత విద్యుత్తు ప్రారంభం కానుంది. దీనిపై చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version