AP Free Cell Phones: ఏపీ ప్రభుత్వం( AP government) దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. మూగ, చెవిటితనంతో బాధపడుతున్న బధిరులకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్ల వయసు కలిగి.. ఇంటర్ పాసైన వారు ఎందుకు అర్హులు. 40% వైకల్యం, సైగల భాష వచ్చినవారు అర్హులని స్పష్టం చేసింది విభిన్న ప్రతిభావంతుల శాఖ. అర్హులు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు మాత్రమే ఉండాలని సూచించింది. ఆసక్తి కలిగిన వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించింది.
Also Read: పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే సరైన వయస్సు ఏంటో మీకు తెలుసా?
పరికరాల కోసం పరీక్షలు..
ఇప్పటికే విభిన్న ప్రతిభావంతుల శాఖ దివ్యాంగులకు అనేక రకాల పథకాలు( welfare schemes) అమలు చేస్తోంది. రాయితీలు కూడా ఇస్తోంది. మూడు చక్రాల మోటార్ వాహనాన్ని అందిస్తోంది. తాజాగా ఉచితంగా సెల్ ఫోన్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది వారికి అవసరమైన పరికరాలు అందించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరికరాలు ఇవ్వడానికి స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేస్తున్నారు. 18 ఏళ్ల లోపు వారికి పరీక్షలు చేసి.. అర్హులైన వారికి పరికరాలు ఇస్తారు. సమగ్ర శిక్ష ద్వారా ఈ పరికరాలు అందిస్తారు. ప్రస్తుతం ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి అన్ని విభాగాల్లో పరీక్షలు చేస్తున్నారు. ఈనెల 26 తో ఈ పరీక్షలు పూర్తవుతాయి. తరువాత మూడు చక్రాల బండ్లు, వీల్ చైర్లు ఇస్తారు. చంక కర్రలు, వినికిడి యంత్రాలు కూడా అందిస్తారు. కళ్ళు సరిగా కనపడని వారికి ప్రత్యేక టిఎల్ఎం కిట్లు ఇస్తారు.
Also Read: మొబైల్ వాడే వారికి హెచ్చరిక.. నిద్ర తక్కువైతే సంతాన లేమి సమస్య?
40% వైకల్యం ఉంటేనే..
అయితే ఇప్పుడు మూగ, చెవిటితనంతో బాధపడే వారికి ఉచితంగా సెల్ఫోన్లు అందించడానికి నిర్ణయించింది. 40% పైన వైకల్యం ఉన్నవారు మాత్రమే అర్హులు. ఆధార్ కార్డ్( Aadhar card), పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, సదరం ధ్రువీకరణ పత్రం, సైగల భాష ధ్రువీకరణ, ఎస్సీ, ఎస్టి, బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు పంపాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు కాపీలు అవసరం ఉంటుంది. కేవలం వారికి ప్రోత్సాహం అందించేందుకు.. వారి ఉన్నత విద్యల కోసం ఈ సెల్ ఫోన్లు ఉచితంగా అందించేందుకు నిర్ణయించింది ఏపీ విభిన్న ప్రతిభావంతుల శాఖ.