Homeఆంధ్రప్రదేశ్‌Good News For Dwcra Women: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్!

Good News For Dwcra Women: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్!

Good News For Dwcra Women: ఏపీలో( Andhra Pradesh) డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రుణానికి సంబంధించి వడ్డీ విషయంలో చాలా రకాల మినహాయింపులు ఇచ్చింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు.. వారి కాళ్లపై వారు నిలబడే విధంగా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. శ్రీనిధి కింద ఒక్కో డ్వాక్రా మహిళలకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. 11% వడ్డీతో కూడా రుణాలు ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. వీటికి ఎలాంటి హామీ కూడా అవసరం లేదు. ప్రాసెసింగ్ తో పాటు డాక్యుమెంటేషన్ ఫీజు కూడా ఉండదు. ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 48 గంటల్లోనే డబ్బులు అకౌంట్లలో జమ చేస్తారు. ఏపీ ప్రభుత్వం ఏకంగా దీనికోసం మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది. ఎప్పటికే స్త్రీ నిధి రుణం విషయంలో అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు సరికొత్తగా అమలు చేయాలని నిర్ణయించడం విశేషం.

  • రాష్ట్రంలో సెర్ఫ్ పరిధిలో 8.43 లక్షల సంఘాల్లో 85.75 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. శ్రీనిధి ద్వారా పదిమంది సభ్యులు ఉండే డ్వాక్రా సంఘానికి ఎనిమిది లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. అంటే ఒక్కొక్కరికి లక్ష వరకు వర్తిస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న లక్షకు తోడు మరో రెండు లక్షలు కలిపి మూడు లక్షల రూపాయల వరకు ఇవ్వాలని నిర్ణయించింది.
  • స్త్రీ నిధి రుణం అనేది వ్యక్తిగతంగానే ఇస్తారు. ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు సెర్ఫ్ అధికారులు డ్వాక్రా మహిళల వివరాలు సేకరిస్తారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికి, కొత్తవారికి ప్రతి సమాఖ్య పరిధిలో 15 మందిని ఎంపిక చేస్తారు.
  • ఎస్సీ ఎస్టీ మహిళలకు స్త్రీ నిధి కింద లక్ష రూపాయలతో పాటు అదనంగా 2 లక్షల ను ఉన్నతి పథకం కింద అందిస్తారు. దీనికి వడ్డీ కూడా ఉండదు. మొత్తం నాలుగు లక్షల రూపాయల వరకు రుణంగా ఇస్తారు.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular