AP DSC: దీనికి సంబంధించి ఆచార్య యాప్ లో కూడా అభ్యర్థులకు సేవలను అందించనుంది. మంత్రి సవిత అభ్యర్థుల కోసం ఉచిత డీఎస్సీ కోచింగ్ను ఇటీవల ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు రెడీగా ఉంది. అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బిసి, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టి, డీఎస్సీ అభ్యర్థులందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ఉచితంగా డీఎస్సీ కోచింగ్ అందించబోతుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ సేవలను ఇటీవల ప్రారంభించారు. దీని గురించి మాట్లాడిన మంత్రి సవిత ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య యాప్ ని కూడా రూపొందించామని చెప్పుకొచ్చారు.
Also Read: వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా..కోల్ కతా పై పంజాబ్ సరికొత్త రికార్డు
ఈ యాప్ ద్వారా అభ్యర్థులందరికీ 24 గంటల పాటు ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగాడిఎస్సి నిర్వహణ ఫైల్ పై చేసినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ డిఎస్సీ ద్వారా అత్యధిక ఉపాధ్యాయ పోస్టులను బీసీ అభ్యర్థులే సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఉచిత కోచింగ్ సెంటర్లను ప్రారంభించింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు.
కోచింగ్ కు వెళ్లలేని గృహినిలు అలాగే సదూర ప్రాంతా వాసులతో పాటు ఇతరులకు లబ్ధి కలిగేలాగా ఇంటి దగ్గర నుంచే ఉచితంగా శిక్షణ పొందడానికి ఆన్లైన్ కోచింగ్ ప్రారంభించినట్లు మంత్రి సవిత చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టి అభ్యర్థులు అందరికీ కూడా డీఎస్సీ ఉచిత కోచింగ్ అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 3,189 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ కూడా ఆన్లైన్ ఉచిత కోచింగ్ ద్వారా డిఎస్సి ఉచిత శిక్షణ అందిస్తామని తెలియజేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ కాకినాడకు చెందిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ దరఖాస్తు చేసుకున్న వాళ్లకి అందిస్తున్నట్లు తెలిపారు.