Pawan Kalyan : ఈ ఫొటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న వీళ్లిద్దరు ఎవరో గుర్తుపట్టారా..?, ఈ ఫోటో లో ఉన్న చిచ్చర పిడుగు పేరు తీస్తే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు పూనకాలు వచ్చి ఊగిపోతారు. అభిమానులు ఈ కుర్రాడిని ఒక దేవుడిలాగా కొలుస్తారు..టాక్ తో సంబంధం లేకుండా, దర్శకుడు ఎవరైనా కానీ ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ పెట్టడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. హిట్లు చాలా ఆలస్యంగా అభిమానులకు ఇస్తాడు కానీ, ఒక్కసారి హిట్ కొడితే మాత్రం పది సంవత్సరాల వరకు ఎవ్వరూ ముట్టుకోలేని రికార్డ్స్ పెట్టడం ఇతనికి అలవాటు. అంతే కాదండోయ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇతని పేరు లేకుండా ఉండదు. ఈ సార్వత్రిక ఎన్నికలలో నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ తో, పోటీ చేసిన అన్నీ స్థానాల్లో గెలిచి చరిత్ర తిరగరాసాడు, ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.
ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత గుర్తుపట్టకుండా ఎవ్వరైనా ఉంటారా?, అతను మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఎవరికీ తెలియదు చెప్పండి!. కాసేపటి క్రితమే ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ఈ ఫోటోని షేర్ చేసాడు. ఆయన పక్కన ఉన్నది ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ సోదరి. చిన్నప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ముఖం లో ఏ మార్పు లేదు. ఈ ఫోటో ఆయన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. అభిమానులు తమ ఆరాధ్య దైవాన్ని చూసి ఎంతో మురిసిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఇంస్టాగ్రామ్ చాలా తక్కువగా వాడుతారు. కానీ ఆయనకీ ఉన్న రీచ్ ఎవరికీ ఉండదు. ఆయన అప్లోడ్ చేసిన ప్రతీ పోస్టుకి 1 మిలియన్ కి పైగా లైక్స్ రావడం విశేషం. ఆయన తోటి హీరోలకు కనీసం 5 లక్షల లైక్స్ రావడం కూడా కష్టమే.
ఇంస్టాగ్రామ్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి, అభిమానులు పొలిటికల్ వార్తల కోసం, ఎక్కువమంది జనాలకు చేరువ అయ్యేలా ఇంస్టాగ్రామ్ ని తరచూ వాడుతూ ఉండమని పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి కోరుతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఆయన కేవలం 13 పోస్టులు మాత్రమే వేసాడు. ఇకపోతే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. డిప్యూటీ సీఎం గా ఉన్నపుడే ఈ రేంజ్ లో పనిచేస్తే, ఇక సీఎం అయితే ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తాడో అని జనాల చేత అనిపించుకుంటున్నాడు. అయితే ఇన్ని రోజులు రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన ఆయన, త్వరలోనే ఓజీ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. సెప్టెంబర్ మూడవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనుంది.