https://oktelugu.com/

Nitish Kumar Reddy : యువ క్రికెటర్‌కు ఏపీ సర్కార్‌ నజరానా.. రూ.25 లక్షల చెక్కు అందించిన సీఎం చంద్రబాబు!

టీమిండియా యువ క్రికెటర్‌.. ఆస్ట్రేలియాలో అద్భుతమైన ఆటతో అదరగొట్టిన తెలుగు ప్లేయర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డి. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చిన నితీశ్‌ ఇటీవలే ఏపీకి వచా‍్చడు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కాడు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు.

Written By:
  • Ashish D
  • , Updated On : January 17, 2025 / 08:29 AM IST
    Follow us on

    Nitish Kumar Reddy : టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన తెలుగు క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డి (Nitish Kumar Reddy).. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు వచ్చాడు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక నాలుగు రోజుల క్రితం తిరుతి వెళ్లిన నితీశ్‌ తర్వాత విశాఖలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలు ముగియడంతో గురువారం(జనవరి 16న) ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు(Chandrababu)ను కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో కుటుంబంతో కలిసి వెళ్లారు. తండ్రి ముత్యాలరెడ్డితో కలిసి సీఎంతో నితీశ్‌ సమావేశమయ్యారు. వారివెంట ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు కూడా ఉన్నారు. ఇందులో విజయవాడ ఎంపీ కేశినేటి చిన్ని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు క్రికెటర్‌ నితీశ్‌కు రూ.25 లక్షల చెక్కును అందించారు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తర్వాత ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. ఆ చెక్కును సీఎం అందించారు. తండ్రి ముత్యాలరెడ్డితో కలిసి నితీశ్‌ ఈ చెక్కును అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.

    ఇంటి వద్దే నితీశ్‌..
    ఆస్ట్రేలియా టూర్‌లో బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించాడు. ఓ సెంచరీ చేశాడు. యువ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. టూర్‌ ముగిసిన తర్వాత ఇండియాకు వచ్చిన నితీశ్‌ ఇటీవలే ఏపీకి వచ్చాడు. ప్రస్తుతం విశాఖలోని తన ఇంటివద్దే ఉంటున్నాడు. సొంత రాష్ట్రానికి వచిచన తర్వాత తిరుపతికి వెళ్లాచ్చాడు. తిరుపతిలో మెట్లు ఎక్కిన ఫొటోలను స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. తరా‍్వత సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందేలు నిర‍్వహిసు‍్తన్న భీమవరం వెళ్లాడు. సాధారణ పౌరుడిలా కోడి పందేలు వీక్షించాడు. ఇప్పుడు సీఎం చంద్రబాబును కలిశాడు.