Anudeep Katikala Standup Comedy Controversy: హాస్యం వివాదం అవుతోంది.. అత్యంత వివాదాస్పదంగా కూడా మార్చేస్తున్నారు. డబుల్ మీనింగ్ తో.. ఇతరులపై కుళ్ళు జోకులతో హాస్యం నిర్వచనాన్ని మార్చేస్తున్నారు. ఇటీవల కాలంలో అయితే స్టాండప్ కామెడీ అంటూ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. వ్యక్తిగత జీవితాలపై వెకిలి జోకులు, కామెడీ కామెంట్స్ డోసు పెంచేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అటువంటి వివాదమే తెరపైకి వచ్చింది. స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన అనుదీప్ కటికాల మెగా కుటుంబం పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నిహారిక మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై మెగా ఫాన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. స్టాండప్ కమెడియన్ అనుదీప్ పై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో సైతం టార్గెట్ చేసుకుంటున్నారు.
* శృతి మించి వ్యాఖ్యలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో( AP deputy CM Pawan Kalyan ) పాటు ఆయన అన్న కూతురు నటి నిహారికపై హాట్ కామెంట్స్ చేశారు అనుదీప్. ఓ స్టాండప్ షోలో డైవర్స్ అనే అంశంపై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిహారికకు డైవర్స్ సమయంలో.. పేపర్ల పై సంతకం పెట్టే విషయంలో పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశారని సర్టైరికల్ గా మాట్లాడారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు డైవర్స్ విషయంలో అనుభవం ఉందని అన్నాడు. అంతేకాదు ఈ విషయంలో నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేయమని నిహారిక కు సలహా ఇచ్చాడంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. స్టాండప్ కామెడీ పేరుతో ఏకంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* గుర్తింపు కోసమే..
అనుదీప్ కటికాలకు( Anudeep ka tikala ) పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ పై మాట్లాడటంతో ఆయన సెలబ్రిటీగా మారిపోయాడు. కేవలం ఫేమస్ అయ్యేందుకే ఇలా మెగా ఫ్యామిలీ వ్యక్తిగత వ్యవహారాలపై మాట్లాడినట్లు అర్థమవుతోంది. వాస్తవానికి స్టాండ్ అప్ కామిడీ అనేది ఒక మేధోపరమైన కళా ప్రక్రియ. కానీ కొంతమంది ఇలా బూతులు మాట్లాడడం, అశ్లీలత ప్రదర్శించడం, ప్రముఖులను కించపరచడం ద్వారా పాపులారిటీ సంపాదించవచ్చునని తప్పుడు ధోరణితో ఉన్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఒక ప్రచారాస్త్రగా మారింది. అనుదీప్ లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం వెనుక తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు పొందాలని ఆశ కనిపిస్తోంది. అయితే ఇటువంటి చర్యలు కేవలం మెగా ఫాన్స్ కి కాదు సామాన్యులకు సైతం ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అయితే అనుదీప్ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు.