Annadata Sukhibhava Scheme: ఏపీ ప్రభుత్వం( AP government) రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కానుంది. రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయల నగదు జమ కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈరోజు పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 46,85,838 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ రూ.6000… రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ రూ.14000.. ఇలా మొత్తం కలిపి రూ.20000 అందించనున్నారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ మాదిరిగానే మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనుంది. తొలి రెండు విడతల్లో రూ.7000 చొప్పున.. చివరి విడతలో రూ.6000 అందించనున్నారు.
నిధుల కేటాయింపు ఇలా..
అన్నదాత సుఖీభవతో( Annadata Sukhi Bhava ) పాటు పీఎం కిసాన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకానికి రూ.2342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.831.51 కోట్లు అందించనున్నాయి. లబ్ధిదారుల జాబితాలో వేరులేని రైతులు 155251 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. చాలామంది ఆధార్, వెబ్ల్యాండ్ సహా పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆ సమస్యలను పరిష్కరించి అందరి రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పడేలా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఆ సమస్యలు పరిష్కరించే పనిలో ఉన్నారు అధికారులు.
Also Read: జగన్ సన్నిహితుడికి బిజెపి గాలం!
ఇలా చెక్ చేసుకోవచ్చు..
మరోవైపు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నగదు బ్యాంకు ఖాతాలో( bank account) జమ అయ్యిందో? లేదో? తెలుసుకునేందుకు స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దీనికోసం రైతులు ప్రభుత్వ వెబ్సైట్ https:// annadathasuukhibhava.ap.gov.in/ లోకి వెళ్ళాలి. చెక్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి. రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేసి.. పక్కనే ఉండే కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఆ రైతు ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో.. లేదో కూడా తెలుస్తుంది. ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు.