Anil Kumar Yadav: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగారు అనిల్ కుమార్ యాదవ్. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీంతో ఆయన రాజకీయాలను వదిలేస్తారని ప్రచారం జరిగింది. కూటమి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా టాక్ నడిచింది. ఇటువంటి సమయంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. పూర్తి స్పష్టత ఇచ్చారు. గత పది నెలలుగా కుటుంబ, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. పార్టీలో యాక్టివ్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. త్వరలో కీలక బాధ్యతలు కూడా స్వీకరిస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
Also Read: మద్యం కుంభకోణంలో టిడిపి ఎంపీ.. కుటుంబం నుంచే ఆరోపణలు!
* పదివేల మంది ఉపాధికి దూరం..
అయితే సడన్ గా తాడేపల్లి ప్యాలెస్ లోకి( Tadepalli Palace) ఎంట్రీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వైసిపి పేరు చెప్పి భారీ ఎత్తున ప్రభుత్వ గనులు ముగించి వేయడాన్ని అని తప్పుపట్టారు. జిల్లాలో ఈ ప్రభుత్వం రాక ముందే అక్రమ మైనింగ్ పై 255 కోట్ల మేర జరిమానా విధించారు. దానిని ప్రభుత్వం వసూలు చేసుకోవడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ ఆపి తనిఖీలు చేశారని.. కానీ రిపోర్టు వచ్చాక గనులు తెరవలేని విషయాన్ని కూడా ప్రస్తావించారు. పెనాల్టీ లేనివి తెరవకుండా.. పెనాల్టీ ఉన్న మైండ్ లను ఓపెన్ చేశారని ఆరోపణ చేశారు అని. జిల్లాలో యాక్టివ్ మైన్స్ 100 వరకు ఉన్నాయని.. కానీ ఎంపిక చేసిన 30 మాత్రమే ఓపెన్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిందని.. నెల్లూరు జిల్లాలో మైన్లు మూసివేతతో పదివేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
* ఎంపీపై సంచలన ఆరోపణలు..
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) వేంరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. ఎన్నికల కు ముందు అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి నచ్చక వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే వేంరెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్ చేశారు. ఎంపీ వేం రెడ్డికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇప్పుడు మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యల వల్ల గనుల పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులు వీధిన పడ్డారని ఆరోపించారు. వారి ఉసురు పోసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. జిల్లాలో గనుల మైనింగ్ కు సంబంధించి జరుగుతున్న అక్రమాలపై ఆధారాలను బయటపెట్టారు. వాటిని విలేకరులకు సైతం చూపించారు. ఈ మైనింగ్ విషయంలో ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ అనిల్ సంచలన ఆరోపణలు చేశారు.
* అనిల్ తీరు నచ్చక రాజీనామా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Vem Reddy Prabhakar Reddy) ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి సైతం ప్రభాకర్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ తీరులో మార్పు వచ్చింది. ముఖ్యంగా అప్పట్లో ఆయన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్ సైతం అనిల్ కుమార్ యాదవ్ ను సముదాయించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఎన్నికలకు ముందు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి జంప్ చేశారు. అయితే ఎప్పటికైనా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తారన్న ప్రచారం ఉంది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ సడన్ గా ఎంట్రీ ఇచ్చారని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య గ్యాప్ పెంచేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గత ఏడాది చివర్లో గనుల యజమానులు కలిసి.. తమ మైన్స్ ఓపెన్ చేయాల్సిందిగా అభ్యర్థించారు
నాకు గనులతో సంబంధం లేదు.. సంబంధిత మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చి అప్పట్లో వారిని పంపారు
కానీ.. లక్ష్మి క్వార్జ్ అండ్ సాండ్ కంపెనీలో ఎంపీ… pic.twitter.com/Hp3jpP0yIL
— Anitha Reddy (@Anithareddyatp) May 5, 2025