AP government ration news : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్ పంపిణీకి ప్రభుత్వం వాహనాలను పక్కనపెట్టి చౌక ధరల రేషన్ షాపుల ద్వారానే ప్రజలకు పంపిణీ చేస్తున్న క్రమంలో ఇప్పటికీ సర్వర్ సమస్యలు లేదా ఇతర ఇతర కారణాల వలన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ అందకపోవడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం డీలర్లకు కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరులో రేషన్ షాపులని పరిశీలించి ఈ కీలక ఆదేశం జారీ చేశారు. లబ్ధిదారుల నిర్ధారణ కోసం ప్రస్తుతం రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ పరికరాలని ఉపయోగిస్తున్నారు. కానీ రాష్ట్రంలో పలుచోట డీలర్లు బయోమెట్రిక్ పరికరాలు కనెక్ట్ అయ్యి ఉన్న సర్వర్ పనిచేయడం లేదు అని కొన్ని సాంకేతిక కారణాలతో పలుచోట్ల రేషన్ సరుకులని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వర్ పనిచేయడం లేదు అని రేషన్ కార్డు లబ్ధిదారులను డీలర్లు వెనక్కి పంపేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది లబ్ధిదారులు పలుమార్లు రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
వీటిని గమనించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సర్వర్తో సంబంధం లేకుండా రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ ఇవ్వాల్సిందే అని తెలిపారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో సర్వర్ సమస్యలు ఎదురైనప్పటికీ రేషన్ పంపిణీ మాత్రం ఆపకుండా ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ డీలర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ సర్వర్ పని చేయకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా డీలర్లు రేషన్ కార్డు లబ్ధిదారుడి ఫోటోతోపాటు సంతకం కూడా తీసుకొని రేషన్ ఇచ్చి పంపించాలని ఆదేశించారు. అంతేకానీ లబ్ధిదారులకు రేషన్ ఆపేందుకు మాత్రం వీలులేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఇకపై రాష్ట్రంలో సర్వర్ వంటి సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రేషన్ పంపిణీ మాత్రం జరుగుతుందని తెలుస్తుంది.
దీనికి సంబంధించి ప్రస్తుతం డీలర్లు తమ పరిధిలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులందరి డేటాను నిర్వహిస్తున్నారు. తమ పరిధిలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల వివరాలతో వాళ్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పద్ధతి ద్వారా రాష్ట్రంలో రేషన్ పంపిణీ మరింత సులభతరం చేసేందుకు అధికారులు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇకపై రాష్ట్రంలో రేషన్ షాపుల దగ్గర సర్వర్ సమస్యలు వంటివి ఎదురైనప్పటికీ రేషన్ మాత్రం దొరుకుతుంది అని తెలుస్తుంది.
Also Read : రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సన్న బియ్యం సిద్ధం చేస్తున్న అధికారులు!