Vattivepamanupalli Village : కోడి కూత కనిపించని గ్రామం అదీ

వట్టివేపమాను పల్లి గ్రామానిది సుదీర్ఘ చరిత్ర. 150 సంవత్సరాల కిందట ఊరు ఏర్పడినట్టు అక్కడి చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి గ్రామ పరిసరాల్లోని చెట్లను తపస్సు పక్షులుఆవాసంగా మార్చుకున్నాయి.

Written By: Dharma, Updated On : April 28, 2023 10:06 am
Follow us on

Vattivepamanupalli Village : ఆ గ్రామ ప్రజలు పొద్దున్నే పక్షుల కూతతో నిద్రలేస్తారు. దినచర్యను ప్రారంభిస్తారు. అదేంటి కోడి కూతతో కదా పొద్దు ప్రారంభమవుతుంది కదా? ఇలా పక్షులతో ఎలా అనుకుంటున్నారా? కానీ మీరు చదివింది నిజం. ఆ గ్రామస్థులకు మాత్రం పక్షుల కిచకిచరాగాలే గడియారాలు. దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ. రాత్రంతా ఆహారం కోసం శ్రమించే ఈ పక్షులు తెల్లవారుజామున తమ ఆవాసాలకు చేరుకునే క్రమంలో గ్రామస్థులను నిద్రలేపి.. తాము మాత్రం నిద్రలోకి జారుకుంటాయి. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఈ స్టోరీ. ఆ గ్రామం ఏదో.. అక్కడ పక్షుల సంగతెంటో ఒకసారి చూద్దాం. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వట్టివేపమానుపల్లి అనే ఒక కుగ్రామం ఉంది. ఆ గ్రామంచుట్టూ ఉండే చెట్లకు వేలాది పక్షులు ఉంటాయి. వాటిని తపస్సు పక్షులంటారు. వాటితో తమ బంధం విడదీయరానిదని గ్రామస్థులు చెబుతున్నారు.

సుదీర్ఘ చరిత్ర…
వట్టివేపమాను పల్లి గ్రామానిది సుదీర్ఘ చరిత్ర. 150 సంవత్సరాల కిందట ఊరు ఏర్పడినట్టు అక్కడి చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి గ్రామ పరిసరాల్లోని చెట్లను తపస్సు పక్షులుఆవాసంగా మార్చుకున్నాయి. సుమారు 8 వేల పక్షులుంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. అవి నిరంతరం గ్రామానికి రక్షణగా నిలుస్తున్నాయి. అటు గ్రామస్థులు సైతం అదే భావనతో ఉంటారు. తపస్సు పక్షులను దైవంగా భావిస్తారు. తాము సాగు చేసే పంటలకు తపస్సు పక్షులే నిరంతర రక్షణగా నిలుస్తాయని, వీటి కిచకిచ రాగాలతో పంటలలో సాగు చేసే ఆహార ధాన్యాలను తాకేందుకు పక్షులు కూడా రావన్నది గ్రామస్థుల ప్రగాడ నమ్మకం. ఈ పక్షుల వల్ల ఎటువంటి అనర్థాలు జరగకపోక.. అపశకునాలు అన్నవే ఉండవని గ్రామ ప్రజలు చెబుతున్నారు.

విడదీయరాని బంధం
రకరకాల కారణాలతో పక్షులు అంతరించిపోతున్నాయి. కానీ ఈ గ్రామంలో మాత్రం పక్షులను సంరక్షలో గ్రామస్థులు చూపుతున్న చొరవ అభినందనీయం. ఎవరైనా తెలియకుండా పక్షులకు హాని చేస్తే అడ్డుకుంటారు. శృతిమించితే మాత్రం ప్రతాపం చూపుతారు. అంతలా పక్షులతో వీరి బంధం ఏర్పడింది. కరోనా కాలంలో తపస్సు పక్షుల వల్ల వ్యాధి విజృంభిస్తుందని కొన్ని వదంతులు వ్యాపించినా, ఈ గ్రామస్తులు అవేమీ పట్టించుకోలేదు.  తపస్సు పక్షుల జీవనమనగడకు వట్టివేపమానుపల్లి గ్రామం నిలయమైంది. తమ గ్రామంలో తపస్సు పక్షులు లేని రోజులను తాము ఊహించలేమని, తపస్సు పక్షులే తమ పాలిట దేవుళ్ళుగా భావిస్తున్నట్లు వట్టివేపమానుపల్లె గ్రామస్తులు చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఈ స్టోరీ.