Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Heatwave: ఏపీలో మండిపోనున్న ఆ జిల్లాలు.. బయటకు రాకపోవడమే మంచిది

Andhra Pradesh Heatwave: ఏపీలో మండిపోనున్న ఆ జిల్లాలు.. బయటకు రాకపోవడమే మంచిది

Andhra Pradesh Heatwave: ఏపీలో( Andhra Pradesh) ఎండల తీవ్రత అమాంతం పెరిగింది. వేడి గాలులు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంది.. ఇకనుంచి పరిస్థితి ఇలానే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గట్టి హెచ్చరికలు పంపింది. ఈరోజు ఎండలతో పాటు వేడి గాలుల తీవ్రత పెరుగుతుందని చెప్పింది. ఇప్పటికే 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. మున్ముందు రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత పెరిగింది. మిగతా ప్రాంతాల్లో సైతం మున్ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. వాస్తవానికి ఇప్పటివరకు వేసవి ప్రతాపం అంతంత మాత్రమే. ఎందుకంటే మధ్యలో రకరకాల ప్రభావాలతో వర్షాలు పడుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరిగింది.
* ఈరోజు ఏపీ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్య ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, పోలవరం జిల్లాలోని సుమారు 30 మండలాల్లో తీవ్రవడగాలులు, మరో 55 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
* పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో గరిష్టంగా 43 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
* గురువారం అత్యధికంగా నంద్యాల జిల్లా సంజామలలో 45.1°, కడప జిల్లా ఒంటిమిట్టలో 44.9, మార్కాపురం జిల్లా అనుమల పల్లిలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
* ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. వేడి గాలులు వీస్తున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు జనతాకిడి గణనీయంగా తగ్గింది.
* ఇకనుంచి వేసవి తీవ్రత అలానే ఉంటుందని విపత్తుల నిర్వహణ సమస్త హెచ్చరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular