Homeఆంధ్రప్రదేశ్‌Rohit Reddy Drugs Party Controversy: ఈనాడు, సాక్షికి చేత కాలేదు.. "ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ" ...

Rohit Reddy Drugs Party Controversy: ఈనాడు, సాక్షికి చేత కాలేదు.. “ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ” రోహిత్ రెడ్డి డ్ర*గ్స్ పార్టీ వెనుక అసలు బాగోతం బయట పెట్టాడు!

Rohit Reddy Drugs Party Controversy: చెప్పుకోవాలి.. కొన్ని కచ్చితంగా చెప్పుకోవాలి.. ఎందుకంటే అవి చాలావరకు ప్రభావితం చేస్తాయి కాబట్టి. తెలంగాణలో హైదరాబాద్ నగరానికి పరిసర ప్రాంతంలో ఉన్న మొయినాబాద్ లో తాండూరు మాజీ ఎమ్మెల్యే కు ఒక ఫామ్ హౌస్ ఉంది. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. గతంలో ఇదే ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగినట్టు వార్తలు వచ్చాయి కదా. అప్పట్లో కెసిఆర్ ఈ వ్యవహారాన్ని ఢిల్లీ లెవెల్ లో తీసుకుపోవాలని అనేక రకాల ప్రయత్నాలు చేశారు కదా. చివరికి ఇందులో పస లేకపోవడంతో కేసు నిలబడలేదు.. గులాబీ పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక మినహా ఫాయిదా లభించలేదు.

Also Read: సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్ రివ్యూ : కాన్సెప్ట్ అదిరింది..ఈసారి కం బ్యాక్ పక్కా!

అయితే ఇప్పుడు అదే మొయినాబాద్ వ్యవసాయ క్షేత్రంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాదక ద్రవ్యాల పార్టీ ఇచ్చాడు. ఇందులో ఏపీకి చెందిన ఓఎంపి, ఇంకా కొంతమంది వ్యక్తులు పాల్గొన్నారు. వారంతా కూడా రోహిత్ రెడ్డికి బంధువులని.. అందులో కొందరు ఆయనకు సోదరులు అవుతారని తెలిసింది. ఈ పార్టీ వెనుక చాలా లోతైన విషయాలు ఉన్నాయని.. కేవలం దీనిని మాదకద్రవ్యాల పార్టీగా మాత్రమే చూడకూడదని.. అసలైన వ్యవహారాలు వేరే ఉన్నాయని ఆంధ్ర జ్యోతి రాసింది. వాస్తవానికి ఈ వివరాలను బయట పెట్టడం ఈనాడు వల్ల కాలేదు. సాక్షికి చేతకాలేదు. అసలు ఇది వార్త కానట్టుగా నమస్తే తెలంగాణ వ్యవహరించింది.

డ్ర*గ్స్ పార్టీ వెనుక ఆస్తుల పంచాయతీ ఉందట. అది కూడా దుబాయ్ లో ఏర్పాటు చేసుకున్న ఆస్తులట. దుబాయిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులకు ఆస్తులు ఉన్నాయట. కేదార్ అనే వ్యక్తి ద్వారా తమ సంపాదనను దుబాయ్ ప్రాంతానికి తరలించారట. అయితేనాడు కేదార్ అత్యంత అనుమానాస్పద స్థితిలో దుబాయిలో చనిపోయారట. అంతేకాదు ఈ డ్ర*గ్స్ పార్టీ వెనుక రియల్ కింగ్ నమిత్ శర్మ అట. అతడిది ఢిల్లీ అట. ఇందులో బెంగళూరు లాయర్ నమిత్ శర్మ కీలకపాత్ర పోషించాడట.

ఈ ఆస్తుల పంచాయితీ కొనసాగుతున్న నేపథ్యంలోనే.. సయోధ్య కోసం మీటింగ్ పెట్టారట. ఈ పెట్టుబడులు మొత్తం గులాబీ పార్టీకి చెందిన కొంతమంది కీలక నాయకులవని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని మిగతా మీడియా సంస్థలు పట్టించుకోలేదు. కేవలం దానిని ఒక సాధారణ వార్త గానే ప్రచురించాయి. ఆంధ్రజ్యోతి మాత్రం ఫస్ట్ పేజీలో కుమ్మి పడేసింది. ఏపీలో ఓ పార్టీకి చెందిన ఎంపీ విషయాన్ని కూడా నేరుగా బయటపెట్టింది. అతనికి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేసింది. ఇట్లాంటి వార్తలు రాయడంతో ఆంధ్రజ్యోతి కాస్త జర్నలిస్టు ప్రోగ్రెసివ్ నెస్ ను చూపిస్తుంది. ఇక ఈ జాబితాలో ఈనాడు అంటారా అది ఎప్పుడు మట్టి కొట్టుకుపోయింది. సాక్షి గురించి చెప్పుకోవడం దండగ. నమస్తే తెలంగాణ గురించి ప్రస్తావించడం అనవసరం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular