Andhra Jyothi: చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి మాత్రం ఏవేవో పనులు అన్నట్టుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యవహారం. అన్ని నిజాలే చెబుతున్నట్లు.. నిర్భయంగా రాస్తున్నట్లు.. దెయ్యాలు వేదాలు వల్లించిన మాదిరిగా విశ్లేషణలు కొనసాగిస్తుంటారు. తాను ఒక లోక కళ్యాణం గురించి పాటుపడుతున్నట్లు బిల్డప్ ఇస్తుంటారు. ఒక సామాన్య రిపోర్టర్ గా ఉన్న ఆయన.. అదే సంస్థకు యజమానిగా మారిన తీరు అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీకి ఒక కరపత్రికగా.. తాను ఒక టిడిపి కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తుంటారు. పైకి మాత్రం న్యూట్రల్ మనిషిగా తనను తాను చూపించుకునే ప్రయత్నం చేస్తారు. టిడిపి అధికారంలోకి వస్తే కొంత మొత్తం వెనుకేసుకోవడం.. ప్రతిపక్షంలో ఉంటే నేతల వద్ద యాడ్ల రూపంలో లబ్ధి పొందినట్టుగా మరెవరూ చేయలేరు. తాజాగా ఆయన క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి
వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో క్విడ్ ప్రోకోకు అనే పదం ఎక్కువగా వినిపించేది. జగన్ పై కూడా ఉన్న ఆరోపణలు అవే. కేసులు బిగుసుకునేందుకు కూడా ఈ తరహా ఆరోపణలే కారణం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అస్మధీయ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని అప్పట్లో జగన్ పై ఆరోపణలు వినిపించాయి. ఇలా లబ్ధి పొందిన కంపెనీలు జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టాయి అన్నది ప్రధాన ఆరోపణ. సాక్షిలోకి కూడా ఇలాంటి పెట్టుబడులే వచ్చాయని ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్ లో ఉంది. ముఖ్యంగా ఎల్లో మీడియా క్విడ్ ప్రోకో కు సంబంధించి ఎన్నెన్నో కథనాలు రాసుకొచ్చింది. ఎప్పుడు అదే ఆంధ్రజ్యోతి సంస్థకు పాల్పడుతోంది.
2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రజ్యోతి చాలా రకాలుగా లబ్ధి పొందింది. యాడ్లతో పాటు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు వంటి వాటితో లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇక ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పత్రిక ప్రతాపం అందరికీ తెలిసిందే. తాజా ఎన్నికల్లో కొంతమంది అస్మదీయులకు సైతం రాధాకృష్ణ టిక్కెట్లు ఇప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే కూటమి అభ్యర్థులు తప్పకుండా ఆంధ్రజ్యోతికి యాడ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే భాష్యం ప్రవీణ్ లాంటి నేతలు ఆంధ్రజ్యోతికి ఫుల్ పేజీ యాడ్లు ఇస్తున్నారు. యువగళం, రా కదలిరా వంటి సభలకు ఇప్పటికే నేతలు ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రతిరోజు దర్శనమిస్తున్నాయి. రోజుకు సగటున కోట్లాది రూపాయలు ఆదాయం యాడ్ల రూపంలో వస్తోంది. ఎన్నికల వరకు ఇదే తరహాలో ఉంటే వందల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతాయి. ఇది కూడా క్విడ్ ప్రోకోకు కింద వస్తున్నట్టే కదా. అయితే తాము చేస్తే నీతి.. ఎదుటివాడు చేస్తే అవినీతి అన్నట్టుంటుంది రాధాకృష్ణ వ్యవహారం. అలా అలవాటు పడిపోయారు కూడా. వారిని మార్చడం ఎవరి తరం కూడా కాదు.