Site icon OkTelugu

Vijayawada airport new flight routes: అమరావతి ఎఫెక్ట్.. విజయవాడ నుంచి కొత్త ఎయిర్ లైన్స్

Vijayawada airport new flight routes

Vijayawada airport new flight routes

Vijayawada airport new flight routes: అమరావతికి( Amravati capital ) చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు వస్తున్నారు. రాజధాని లో పెట్టుబడులు పెట్టేందుకు సాహసిస్తున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర రాజధానికి లేనివిధంగా రక్షణ కల్పించడంతో అందరి చూపు అమరావతిపై పడింది. మరోవైపు ఢిల్లీ వెలుపల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన అధికార కేంద్రంగా అమరావతి మారనుంది. కేవలం పాలనాపరమైన భవనాలే కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే అన్ని రకాల నిర్మాణాలకు వేదిక కానుంది అమరావతి. అయితే ఎప్పుడైతే కేంద్రం చట్టబద్ధత కల్పించిందో ఇన్వెస్టర్లు రావడం ప్రారంభించారు. తాజాగా విజయవాడ నుంచి కొత్త ఎయిర్లైన్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

కేంద్రమంత్రి తో ప్రారంభం..
సరికొత్త విమానయాన సంస్థ ఫ్లై 91 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్ లను ప్రారంభించారు. తొలి విడతగా విజయవాడ- హైదరాబాద్ నగరాల మధ్య ఈ విమానాలు నడవనున్నాయి. గతంలో కొన్ని కంపెనీలు ప్రారంభమయ్యాయి కానీ కొనసాగించలేకపోయాయి. అయితే ఇప్పుడు ఫ్లై 91 నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నం లోనే ఉంది. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

గోవా కేంద్రంగా..
ఫ్లై 91 ఎయిర్లైన్ ను గోవా కేంద్రంగా పనిచేసే.. జస్ట్ వుడో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్( just udo aviation Private Limited) సంస్థ నిర్వహిస్తోంది. కొంకణి భాషలో ఉడో అంటే ఎగరడం అని అర్థం. భారతదేశ కంట్రీ కోడ్ ప్లస్ 91 ను ప్రతిబింబించేలా ఈ సంస్థకు ఫ్లై 91 అని పేరు పెట్టారు. ప్రాంతీయ అనుసంధానంలో భాగంగా.. ప్రధాన నగరాలను కలుపుతూ విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తోంది ఈ సంస్థ. ఇటీవల ఇండిగో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ పెట్టుబడితో..
గతంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్( Kingfisher Airlines) మంచి సేవలు అందించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన మనోజ్ చాకో ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు ప్రముఖ ఇన్వెస్టర్, కన్వర్జేంట్ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు హర్ష రాఘవన్ ప్రధాన పెట్టుబడిదారు గా ఉన్నారు. సుమారు రూ.200 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ సంస్థను వారు స్థాపించారు. ప్రధాన మెట్రో నగరాలకు అనుసంధానం చేస్తూ విమాన సర్వీసులు తిప్పనన్నారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కొత్త ఎయిర్లైన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. కేవలం అమరావతి ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా విజయవాడ నుంచి విమాన రాకపోకలను ప్రారంభించారు

Exit mobile version