Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Capital Security System: అమరావతి రక్షణకు గట్టి వ్యవస్థ

Amaravati Capital Security System: అమరావతి రక్షణకు గట్టి వ్యవస్థ

Amaravati Capital Security System: అమరావతి రాజధాని( Amravati capital ) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత చేయాలో అంత చేసింది. ఆ పార్టీ అమరావతి రాజధానిని ఆమోదించింది. భూ సమీకరణను సైతం సమర్ధించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అది ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రాంతంగా చిత్రీకరించింది. ఐదేళ్లపాటు నిర్వీర్యం చేసింది. బొత్స లాంటి సీనియర్ అయితే దానిని స్మశానంతో పోల్చారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేశారు. కేసులతో వారిని భయపెట్టారు. అయితే ఎలాగోలా రాష్ట్రంలో ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు. మళ్లీ అమరావతికి కొత్త కళ వచ్చింది. కానీ అమరావతి పై మాత్రం కుట్రలు ఆగడం లేదు.

Also Read: హరీష్ శంకర్ డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించాల్సిందేనా…

* రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
ఈనెల 28న అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి తీర్మానం చేసేందుకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం( AP assembly special session ) జరగనుంది. మూడు రాజధానుల అంశంతో ఒక రకమైన అయోమయం వచ్చిన నేపథ్యంలో 2014 రాష్ట్ర విభజన బిల్లును సవరణ చేస్తూ.. అమరావతి ఏకైక రాజధానిగా తీర్మానిస్తూ కేంద్రానికి నివేదించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రత్యేక చట్టం చేయనుంది. అయితే అంతవరకు ఓకే. కానీ అమరావతి ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం ఉందన్నది మెజారిటీ అభిప్రాయం. అందుకే బలమైన ఇప్పుడు రక్షణ వ్యవస్థ అవసరం అమరావతికి. ఎందుకంటే ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఆగలేదు. తన స్వరూపాన్ని మార్చుకుంటూ ముందుకు సాగుతుండడం కొందరికి నచ్చడం లేదు. అందుకే ఇప్పుడు విధ్వంసాలు వరుసగా జరుగుతున్నాయి. అందుకే అనేక రకాల అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

* నిధులు అడ్డుకునేందుకు ప్రయత్నం..
అమరావతి రాజధాని పునర్నిర్మాణం తర్వాత వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు తోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులను సర్దుబాటు చేసింది. కానీ అవి అప్పు అని.. కేంద్రంతో సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అయితే అది కేంద్రం సర్దుబాటు చేసిన నిధులు అని.. దానికి కేంద్రమే షూరిటీ ఉంటుందని కేంద్రం తేల్చి చెప్పడంతో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేశారు. అసలు అమరావతి అనేది ముంపు ప్రాంతమని.. వర్షాలు వచ్చిన ప్రతిసారి మునిగిపోతుందంటూ ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు.. చివరకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం అమరావతి ప్రాంతంలో పర్యటించి అది ఉత్త ప్రచారం అని తేల్చేశారు.

* క్యాబినెట్లో చర్చ..
అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొండి పట్టుదలతో ఉంది. తమ నిర్ణయానికి కాదని ఇప్పుడు అమరావతి పనులు శరవేగంగా జరగడంతో ఆ పార్టీకి మింగుడు పడని విషయం. ఈ పరిస్థితుల్లోనే అమరావతిలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. అవి ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. ఇన్వెస్టర్లను భయపెట్టేందుకు అలా చేస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ భయం పోవాలి అంటే బలమైన నిఘా వ్యవస్థ ఇప్పుడు అమరావతికి అవసరం. నిన్న క్యాబినెట్ లో కూడా సీఎం చంద్రబాబు ఈ విషయం పైనే మాట్లాడారు. అమరావతి పై కుట్రలు జరగకుండా నిఘా వ్యవస్థతో పాటు విద్రోహ చర్యలను అడ్డుకునేందుకు ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular