spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Capital Legal Status 2026: అమరావతి కదిలిస్తామంటే కుదరదు.. డ్యామేజ్ తప్ప

Amaravati Capital Legal Status 2026: అమరావతి కదిలిస్తామంటే కుదరదు.. డ్యామేజ్ తప్ప

Amaravati Capital Legal Status 2026: అమరావతికి( Amravati capital ) రాజముద్ర పడింది. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. గవర్నర్ సైతం ఆమోదముద్ర వేస్తూ ఫైల్ పై సంతకం పెట్టారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న గందరగోళానికి, విష ప్రచారాలకు చెక్ పడినట్లు అయింది. సిఆర్డిఏ ప్రాంతాన్ని అమరావతి రాజధానిగా గుర్తిస్తారు. అయితే ఈ పరిణామం వెనుక కేవలం అమరావతిని ఏకైక రాజధాని అని చెప్పడమే కాదు.. చాలా అంశాలు ఇందులో దాగి ఉన్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనే పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను నిర్ణయించారు. ఆ గడువు 2024 జూన్ 2 తో ముగిసింది. అందుకే గెజిట్ నోటిఫికేషన్ లో అమరావతి రాజధానిని ఆ తేదీ నుంచి గుర్తిస్తూ ఆమోదముద్ర వేస్తారు. అమరావతి ఏకైక రాజధానికి చట్టబద్ధత కల్పించడం వెనుక కేవలం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం మాత్రమే కాదు. అంతకంటే లోతైన ఆర్థిక,, చట్టపరమైన వ్యూహాలు ఉన్నాయి.

* నేరుగా కేంద్ర నిధులు..
కేవలం వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీకి చెక్ చెప్పేందుకే అమరావతికి చట్టబద్ధత కల్పించారన్నది ప్రధాన వాదన. కానీ ఈ చట్టబద్ధతతో కేంద్ర సాయం, నిధుల విడుదల, విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుంది. గతంలో అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నోటిఫై చేసింది. కేంద్ర గెజిట్లో అది పూర్తిస్థాయిలో లేదు. అయితే ఇప్పుడు పార్లమెంటు ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026 అమలులోకి రావడంతో.. అమరావతికి కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా పొందే అవకాశం లభించింది. వరల్డ్ బ్యాంకు తో పాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు వంటి సంస్థల నుండి వస్తున్న సుమారు 26 వేల కోట్ల రూపాయలకు ఈ గెజిట్ నోటిఫికేషన్ ఒక బలమైన గ్యారెంటీగా పనిచేయనుంది.

– ఇప్పటి పరిస్థితులు ఉంటాయా
ఇప్పుడు ఎలాగో.. అప్పుడు అలానే బిల్లు పెట్టి మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి చాలా సులువుగా చెబుతున్నారు. కానీ రాజధానిని మార్చడం అంత సులువు కాదు. ఎందుకంటే రాజధాని అనేది కేవలం ఒక కార్యాలయం కాదు. అది ఒక వ్యవస్థ. పార్లమెంట్ ఒకసారి రాజధాని నోటిఫై చేసిన తర్వాత దానిని మార్చడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు అసాధ్యం. ఒకవేళ మార్చాలనుకున్నా మళ్లీ పార్లమెంట్ ఆమోదం కావాలి. ప్రస్తుత రాజకీయాల్లో అది అంత సులభం కాదు. ఎందుకంటే చేసేది మంచి పని ఉండాలి. ప్రజల ఆమోదం పొంది ఉండాలి. అమరావతి రాజధానికి ఏపీ ప్రజల ఆమోదం ఉంది. అన్నింటికీ మించి రాజకీయ సమీకరణలు కలిసి వచ్చాయి. అందుకే అమరావతి ఏకైక రాజధానికి చట్టబద్ధత లభించింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా మొండిగా ముందుకు వెళితే ఆయనకు పొలిటికల్ డామేజ్ ఖాయం. టిడిపికి తిరుగులేని శక్తి గా మారడం అంతకంటే వాస్తవం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
Oktelugu Epaper
Exit mobile version