Amaravati 2.0: భవిష్యత్తు రాజకీయాలు అమరావతి( Amaravathi capital ) చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతం మాదిరిగా అమరావతిని నిర్వీర్యం చేస్తామంటే కుదిరే పని కాదు. ఎందుకంటే పార్లమెంట్లో చట్టం కాబోతోంది. దానికి చట్టబద్ధత లభించనుంది. దీంతో మునుపటిలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దానిని మూడు ముక్కలు చేసి చూపిస్తామంటే కుదరదు. మూడు రాజధానులు చేస్తామని చెప్పినా ప్రజలు విశ్వసించరు. ప్రత్యేక గెజిట్ తెచ్చి అమరావతికి చట్టబద్ధత అనే సిలువ వేయనున్నారు. దానిని తొలగించే అధికారం ఎవరికి ఉండదు కూడా. అటువంటి పరిస్థితి రాదు కూడా. అదే సమయంలో అమరావతి ఏకైక రాజధాని అని చెప్పుకోలేదు వైసిపి. మూడు రాజధానుల జోలికి పోలేదు. అలా వైసీపీకి శిక్ష వేసింది అమరావతి అంశం. భవిష్యత్తులో రాజధానుల పేరిట వైసీపీ రాజకీయం చేస్తామన్న కుదిరే పని కాదు. అది కుదరదు గాక కుదరదు కూడా.
* వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం..
2029 ఎన్నికల్లో అమరావతి అసలు సిసలు రాజకీయ వేదిక కాబోతుంది. గత ఎన్నికలే రాజధాని చుట్టూ తిరిగాయి. 2028 నాటికి రాజధాని నిర్మాణాలను ఒక రూపుకు తేవాలన్నది ప్రభుత్వ భావనగా తెలుస్తోంది. దాని ద్వారా ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. అమరావతి 2.0 పూర్తయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు గల్లంతు అయినట్టే. ఆ పార్టీకి ఏరకంగా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. అదే కేంద్రం సహకరించుకుంటే.. అమరావతి నిర్మాణం సజావుగా సాగకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్. కానీ ఇప్పుడు అలా కాదు. పూర్తిగా సీన్ మారిపోయింది. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగిపోతుంది. 2014 నుంచి 2019 కి మధ్య మాదిరిగా అమరావతి లేదు. అప్పుడు అమరావతికి భూముల సేకరణకు సమయం పట్టింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పనులు మొదలు పెట్టింది. నిర్మాణాలు కొలిక్కి రాకపోవడంతో.. టిడిపి ప్రభుత్వం ఏమి చేయలేదన్న వైసీపీ విమర్శలను ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం లేదు.
* కేంద్ర ప్రభుత్వ సహకారం..
అమరావతి రాజధాని కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందిస్తోంది. గతానికి భిన్నంగా నేరుగా ఆర్థిక సాయం అందించింది. రైల్వే తో పాటు రోడ్డు ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోంది. తద్వారా తన సాయం ఉంటుందని సంకేతాలు పంపించింది. అన్ని రంగాల కంటే ఆర్థిక రంగం కీలకం. అది కేంద్రంతో ముడిపడి ఉంటుంది. అటువంటి ఆర్థిక రంగానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర జాతీయ బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలు సైతం అమరావతిలో నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. పర్యాటక, ఆతిథ్య రంగాలకు సంబంధించిన నిర్మాణాలు, ప్రాజెక్టులు సైతం పట్టాలెక్కయి. కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతిని చట్టబద్ధత కల్పిస్తోంది. మరి ఇంతకంటే ఏం కావాలి. రాజధాని విషయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం ఆప్షన్ లేదు. ఈ విషయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాపమే శాపంగా మారిందని చెప్పవచ్చు. అమరావతి 2.0 రూపం వస్తున్న కొలది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనం కాక తప్పదు.