spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Amaravathi Postal Services Update: అమరావతికి కేంద్రం మరో గుడ్ న్యూస్

Amaravathi Postal Services Update: అమరావతికి కేంద్రం మరో గుడ్ న్యూస్

Amaravathi Postal Services Update: అమరావతికి( Amaravathi capital ) వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది కేంద్రం. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్ సభ, రాజ్యసభల్లో బిల్లు పెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి సంతకం చేయగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అమరావతిని ఒక ముఖ్య నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంగా మారుతున్న అమరావతికి పోస్టల్ ఒక పిన్ కోడ్ కేటాయించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో ఈ తీపి కబురు చెప్పేందుకు పోస్టల్ శాఖ సిద్ధంగా ఉంది. అమరావతికి కొత్త పిన్కోడ్ రానుంది. రాష్ట్రపతి గెజిట్ పై సంతకం చేసిన మరుక్షణం రాజధానిగా ప్రపంచ చిత్రపటంలోకి రానుంది అమరావతి. ఇంతలోనే ఈ పోస్టల్ పిన్కోడ్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అదే జరిగితే భారత తపాల శాఖ ద్వారా కూడా ఏపీ ఏకైక రాజధాని అమరావతిగా గుర్తింపు దక్కించుకోనుంది.

* పోస్టల్ ఫుల్ క్లారిటీ..
మరోవైపు సామాజిక కార్యకర్త రమేష్ చంద్ర వర్మ వినతి మేరకు పోస్టల్ శాఖ ( Postal department )ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అమరావతికి కొత్త పిన్కోడ్ ఎప్పుడు వస్తుంది? రాజధానిలో జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం ఎప్పుడు చేస్తారు? అని ఆయన ప్రశ్నించగా అమరావతిలో జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణానికి ఇప్పటికే భూమిని సేకరించిన విషయాన్ని అధికారులు చెప్పుకొచ్చారు. ఇది నిర్మాణం పూర్తయిన వెంటనే సర్కిల్ కార్యాలయ అనుమతితో కొత్త పిన్కోడ్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పిన్కోడ్, ఆధార్, పాస్పోర్ట్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలో పోస్ట్ ఆఫీస్ మాత్రమే కాదు.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. ఎప్పటికీ అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఆ కార్యాలయాల నిర్మాణం నిమిత్తం భూములను కేటాయించింది.

* అందుబాటులోకి ప్రధాన బ్యాంకులు..
కొద్ది రోజుల కిందట ఈ అమరావతిలో 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిమిత్తం.. భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు అన్ని ప్రభుత్వ బ్యాంకుల కార్యాలయాలు అమరావతిలో అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు పోస్టల్ శాఖ సేవలు కూడా అందుబాటులోకి రానుండడం శుభపరిణామం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version