Afghanistan Pakistan Conflict 2026: ఆఫ్గానిస్తాన్.. మూడేళ్ల క్రితం వరకు అమెరికా పాలనలో ఉండేది. అమెరికా వైదొలిగిన తర్వాత తాలిబాన్లు బాధ్యతలు చేపట్టారు. దేశాన్ని పాలిస్తున్నారు. అయితే పాకిస్తాన్ తయారు చేసిన ఈ తాలిబాన్లు ఇప్పుడు ఆ దేశానికే ఏకు మేకై కూర్చున్నారు. ముఖ్యంగా తెహ్రీక్ ఎ తాలిబాన్ సంస్థ.. ఆఫ్గానిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్లో దాడులు చేస్తోందిన పాకిస్తాన్ భావిస్తోంది. దీంతో ఈ సంస్థను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఆఫ్గాన్ భూభాగాలపై వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా మరోమారు దాడులు జరిపింది. అయితే తాలిబాన్ల వద్ద ఎయిర్‌ఫోర్స్ లేదు. దీంతో ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. పాకిస్తాన్ దాడిలో సామాన్యులు, మహిళలు, చిన్న పిల్లలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
టీటీపీపై పాకిస్తాన్ ఆరోపణలు
పాకిస్తాన్ ఆరోపణ ప్రకారం ఆఫ్గనిస్తాన్‌లో టీటీపీ ఉగ్రవాదులు ఉండి తమపై దాడులు చేస్తున్నారు. ఈ సంఘటనలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అయితే సర్దార్ లైన్ వివాదం ఈ ఘర్షణకు మూల కారణంగా నిలుస్తోంది.
పాకిస్తాన్ ఉగ్రవాద చరిత్రపై ప్రశ్నలు
పాకిస్తాన్ భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన చరిత్ర ఉంది. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాలిబాన్ సృష్టికర్తగా పేరు తెచ్చుకున్న దేశం ఇప్పుడు తీవ్రవాద బాధితుడిగా కనిపించడం విడ్డూరంగా ఉంది. పాకిస్తాన్ తాను శాంతి ప్రియుడని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఆఫ్గన్ తాలిబాన్‌ను మద్దతు ఇచ్చి ఆధిపత్యం సాధించాలని ఆశించింది. కానీ ఇప్పుడు తిరుగుబాటుతో వణికిపోతోంది.
డ్యూరాండ్ లైన్ వివాదం
ఆఫ్గనిస్తాన్ డ్యూరాండ్ లైన్‌ను అంగీకరించడం లేదు. ఇది పాకిస్తాన్ ఆధిపత్యానికి వ్యతిరేకతను పెంచుతోంది. ఫలితంగా సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులు తీవ్రమవుతున్నాయి. ఈ వివాదం రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీయవచ్చు. పాకిస్తాన్ ప్రవర్తన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.