Accenture Company In Vizag: విశాఖ( Visakhapatnam) నగరం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దిగ్గజ ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే టిసిఎస్, కాగ్నిజెంట్, అదానీ వంటి సమస్యలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధపడ్డాయి. ప్రభుత్వం కూడా ఆయా సంస్థలకు భూములు కేటాయించింది. వీటికి అనుబంధంగా మరి కొన్ని సమస్యలు కార్యాలయాలు తెరిచేందుకు సిద్ధపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఐటి దిగ్గజ పరిశ్రమ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
* జాతీయ మీడియాలో కథనం..
ఏపీలో ఐటీ పరిశ్రమల( it industries) ఏర్పాటుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో రాయిటర్స్ మీడియా సంస్థ సంచలన కథనం ప్రచురించింది. ప్రముఖ ఐటీ పరిశ్రమ యాక్సెంచర్ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోందని ఆ కథనం సారాంశం. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా సుమారు 12000 మందికి ఉపాధి కల్పిస్తామని.. తమకు తగిన భూమి కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సదరు సంస్థ ప్రకటనకు సిద్ధపడగా.. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం.
* దిగ్గజ ఐటీ సంస్థగా యాక్సెంచర్( yaksencher ) ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటి. వివిధ దేశాల్లో ఆ సంస్థకు 7.9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడు లక్షల మంది భారతీయులే కావడం విశేషం. అటువంటి సంస్థ విశాఖకు వస్తే భారీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అనుబంధ రంగాలు కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు రావడం.. కార్యకలాపాలు ప్రారంభించడంతో మిగతావారు కూడా క్యూ కడుతున్నారు.
* ఐటీ దిగ్గజ టిసిఎస్ కంపెనీ విశాఖలోని మిలీనియం టవర్స్ లో త్వరలో సర్వీస్ సెంటర్ ప్రారంభించనుంది.
* విశాఖలో దశలవారీగా 12 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఈ సి ఎస్ అడుగులు వేస్తోంది. రూ. 1370 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
* ప్రస్తుతం రుషికొండ ఐటీ హిల్ పై 21.6 ఎకరాల స్థలాన్ని టిసిఎస్ కు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
* ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా విశాఖలో 1582 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కాపులుప్పాడలో 21.31 ఎకరాలు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది.