RK Kottapaluku: సరిగ్గా నాలుగు వారాల క్రితం.. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ(Andhra Jyothi MD vemuri Radha Krishna).. వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బస్తి మే సవాల్ అంటూ జబ్బలు చర్చుకున్నారు. ఆంధ్రజ్యోతి ద్వారా రాధాకృష్ణ సవాల్ విసరగా.. ట్విట్టర్ నుంచి విజయసాయిరెడ్డి ప్రతి సవాల్ విసిరారు. వీరిద్దరూ ఢిల్లీలో కొట్టుకుంటారేమో అన్నట్టుగా.. ఒకరి బాగోతాలు మరొకరు చెప్పుకున్నారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతానని విజయసాయిరెడ్డి అంటే. ఏహే నువ్వే నా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంకు రా అని ఆర్కె అన్నాడు..
మొత్తానికి ఈ సవాళ్ల ప్రతి సవాళ్ల కార్యక్రమం కొద్దిరోజులు సాగింది. అయితే హఠాత్తుగా విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. గేదెలు కొనుక్కుని, వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించాడు. విజయసాయిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా సంచలనం సృష్టించింది. వేమూరి రాధాకృష్ణ కూడా కావాల్సినంత బలం దొరికింది. ఇంకేముంది తన కొత్త పలుకులు విమర్శలను మొదలుపెట్టాడు. మాదకద్రవ్యాలకు బానిసై.. ఇప్పుడు సన్యాసినిగా మారిన మమతా కులకర్ణితో (Mamta Kulkarni) తో విజయ సాయి రెడ్డి(Vijaya Sai Reddy) రాధాకృష్ణ పోల్చాడు. కేవలం ఈ ఒక్క ఉదాహరణతో విజయసాయిరెడ్డి పై ఉన్న కసిని మొత్తం రాధాకృష్ణ తీర్చుకున్నాడు.. అంతేకాదు మమతా కులకర్ణి సన్యాసవతారాన్ని.. సాయి రెడ్డి రాజకీయ సన్యాసాన్ని పోల్చడం ఆ నిజంగా ఏతరహా పాత్రికేయమో, ఎలాంటి వెక్కిరింపో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు రాధాకృష్ణ మంచి స్వింగ్ లో ఉన్నాడు. రెండు రాష్ట్రాల్లో అనుకూల పార్టీలు అధికారంలో ఉన్నాయి. పైన బిజెపి నుంచి కూడా సపోర్ట్ ఉంది. దీంతో చెలరేగిపోయాడు. విజయసాయిరెడ్డి పై సెటైర్లు వేశాడు.
జగన్మోహన్ రెడ్డితో పడడం లేదట..
విజయ సాయి రెడ్డికి జగన్ మోహన్ రెడ్డికి పడటం లేదు. నిత్యం అనుమానిస్తున్నాడట. దూరం పెడుతున్నాడట. అధికారులకు కత్తెర పెడుతున్నాడట. అందువల్లే తట్టుకోలేక విజయసాయిరెడ్డి బయటికి వచ్చాడట. చివరికి రాజకీయాలకు కూడా దూరంగా వెళ్లిపోయాడట. కానీ ఇదే రాధాకృష్ణ సొంత చానల్ ఏబీఎన్ శనివారం మొత్తం విజయసాయిరెడ్డి బయటికి వెళ్లిపోవడానికి వైయస్ భారతి కారణమనే స్థాయిలో కథనాలను ప్రసారం చేసింది. ప్రచారం కూడా చేసింది. కానీ ఒకరోజు తిరిగేసరికి రాధాకృష్ణ పేపర్లో భారతి ప్రస్తావన లేదు. అన్నట్టు మొన్నటిదాకా భీషణ ప్రతిజ్ఞలు చేసుకున్నా రాధాకృష్ణ, విజయ సాయి రెడ్డి.. కలబడతారా? లేదా రాధాకృష్ణ తన కసిని మొత్తం తీర్చుకుంటాడా? దొరికిందా సమయం అనుకొని తన పగను మొత్తం తీర్చుకుంటాడా? నో నెవర్.. ఇవి సాధ్యం కాదు.. సాధ్యం కాదని రాధాకృష్ణకి కూడా తెలుసు.. కాకపోతే రాజకీయ వాసనలు బాగా పట్టించుకున్న జర్నలిస్టు కాబట్టి.. రాజకీయ కోణంలోనే మాట్లాడుతాడు. అంతిమంగా టిడిపి వాయిస్ మాత్రమే వినిపిస్తాడు. స్థూలంగా చూస్తే అతని ప్రతి అక్షరం లోను వైసీపీపై విధ్వంసమే కనిపిస్తుంది. అంతే.. అంతకుమించి ఏమీ లేదు.. అన్నట్టు ఇంత చాంతాడంత వ్యాసాలు రాధాకృష్ణ మాత్రం గుర్తుకు పెట్టుకుంటాడా ఏంటి? గతంలో షర్మిల మీద ఇంతకంటే ఎక్కువ రాసాడు.. చివరికి ఏం జరిగింది షర్మిల జాకెట్ యాడ్స్ ఇస్తే ఆంధ్రజ్యోతి కళ్ళకు అద్దుకొని ప్రచురించింది.. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత.