ABN And TDP: తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి బలమైన మీడియా దన్నుగా ఉంటుంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాడు బలమైన మద్దతు దారుగా పనిచేస్తోంది. అయితే ఒకవైపు ప్రజల అభిమానాన్ని చూరగొంటూనే.. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు పని చేస్తూ వస్తోంది. అయితే మరో అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి మాత్రం ఒక కరపత్రికలా పని చేస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే చంద్రబాబు చేతికి టిడిపి వచ్చిన తర్వాత.. ఆ పత్రికకు సంబంధించిన యాజమాన్యం మారింది. వేమూరి రాధాకృష్ణ చేతిలోకి ఆ పత్రిక వచ్చింది. అయితే ఆ పత్రిక ఎదుగుదల వెనుక ఆర్కే కృషి ఉంది. అదే సమయంలో టిడిపి ప్రోత్సాహం ఉంది అనేది ఒక వాదన. అయితే పత్రికా రంగంలో ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచింది ఆంధ్రజ్యోతి. ప్రతిపక్షంలో ఉంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు.. అధికారంలో ఉంటే కొనసాగే వీలుగా ఆంధ్రజ్యోతి మీడియా కథనాలు ఉంటాయి అన్నది బహిరంగ రహస్యం. అయితే ఇటీవల ఆంధ్రజ్యోతి కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ పాటిస్తోంది. దీనిని గమనిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రభుత్వానికి ఏబీఎన్ లో ఏమైనా చిన్నపాటి వ్యతిరేక వ్యాఖ్యలు వినిపిస్తే వెంటనే హైలెట్ చేస్తోంది.
* బలమైన సోషల్ మీడియా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన సోషల్ మీడియా( social media) ఉంది. 2014 నుంచి 2019 మధ్య వైసీపీ సోషల్ మీడియా ప్రజల్లోకి అప్పటి టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్ళేది. ఇప్పుడు కూడా అదే పని చేస్తోంది. కానీ మునుపటి మాదిరిగా వర్క్ అవుట్ కావడం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేసిన విన్యాసాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుసు. అందుకే వాటి ప్రభావానికి ఎంత మాత్రం ప్రభావితం కావడం లేదు ఏపీ రాష్ట్ర ప్రజలు. కానీ అదే పనిగా సోషల్ మీడియాలో వైసిపి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది అనేకంటే ప్రచారం చేస్తోంది.
* వ్యతిరేక కథనాలు..
ఇటీవల ఆంధ్రజ్యోతిలో( Andhra Jyothi) ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలు వస్తుండడం వాస్తవమే. అంతమాత్రానికి ఆ మీడియా ప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకుంది అనడం సబబు కాదు. అయితే ప్రభుత్వ వ్యతిరేక కథనాలు వస్తుండడంతో వైసిపి సోషల్ మీడియా తన చేతికి పని చెప్పింది. ఇదిగో ఆంధ్రజ్యోతిలో సైతం వ్యతిరేక కథనాలు వస్తున్నాయి అంటూ ప్రొజెక్ట్ చేస్తోంది. ఏబీఎన్ లో వచ్చిన చిన్నపాటి వ్యతిరేక వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రసారం చేస్తోంది. అయితే ఆంధ్రజ్యోతి విషయంలో మాత్రం టిడిపి కూటమి శ్రేణులు ఓకింత ఆగ్రహంతో ఉన్నాయి. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తోందని ఆవేదనతో ఉన్నాయి. కొంతమంది సీనియర్ నేతలు అయితే ఆంధ్రజ్యోతితో ప్లస్ కంటే.. మైనస్ అధికమన్న అభిప్రాయం ఉంది.
టీడీపీలో అసంతృప్తి.. లోపల కొద్దిగా గుచ్చినట్టుగా.. కొద్దిగా మంటగా.. pic.twitter.com/h5sw5kin7V
— Jagan anna 2.0 (@Jagananna2Po) January 1, 2026