https://oktelugu.com/

Kakinada: బహ్రెయిన్‌లో పి.గన్నవరం మహిళ వెట్టిచాకిరీ.. సోషల్‌ మీడియాలో గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు!

ఉపాధి నిమిత్తం దేశంలోని ఉన్నత విద్యావంతులు అమెరికా, యూకే, ఫ్రాన్స్, జపాన్, కెనడా వంటి దేశాలకు వెళ్తుంటారు. అయితే చదువు రానివారు లేబర్‌ పనులు, ఇంటి పనులు చేసేందుకు గల్ఫ్‌ దేశాలకు వెళ్తుంటారు. కేరళ, తెలంగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి గల్ఫ్‌(Guulg) దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 10, 2025 / 01:18 PM IST

    Kakinada

    Follow us on

    Kakinada:స్థానికకంగా ఉపాధి లేకపోవడం, గల్ఫ్‌ దేశాల్లో ఎక్కువ జీతాలు ఉండడం తదితర కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ నుంచి ఎక్కువ మంది గల్ఫ్‌ దేశాలైన దుబాయ్, ఖతార్, బహ్రయిన్, అబుదాబి తదితర దేశాలకు వెళ్తారు. పురుషులు అక్కడ నిర్మాణ రంగంలో(Building workers) కూలీలుగా పనిచేస్తారు. కాస్త నైపుణ్యం ఉన్నవారు మేస్త్రీలుగా పనిచేస్తారు. ఇక కొందరు పలు కంపెనీల్లో పనిచేస్తారు. కొందరు ఒంటెల కాపరులుగా ఉంటారు. ఇక మహిళలు కూడా గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. వారు అక్కడ షేక్‌ల ఇళ్లలో పనులు చేయడం, వారి పిల్లలను చూసుకోవడం, వంట మనుషులుగా పనిచేస్తున్నారు. అయితే ఇలా వెళ్లిన వారిలో కొందరు అక్కడి షేకల్‌ వేదింపులతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడి నుంచి స్వదేశానికి రాలేక అక్కడే ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. పారిపోయేందుకు యత్నించి జైలుపాలవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ(Andhrapradesh)లోని పి.గన్నవరం మహిళ బహ్రెయిన్‌లో చిక్కుపోయింది. తనను కాపాడాలంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

    ఇబ్బంది పెడుతున్నారని…
    బహ్రెయిన్‌(Bharain) దేశంలో ఉపాధి కోసం వెళ్తిన తనను యజమానులు ఇబ్బంది పెడుతన్నారని, తట్టుకోలేకపోతున్నానని స్వస్థలానికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని వేడుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. అందులో తాను పడుతున్న బాధలు, ఇబ్బందులను వివరించింది. ప్రభుత్వం గుర్తించిన ఏజెంట్లుగా పరిచయం చేసుకున్న కాకినాడకు చెందిన పోలిమాటి లక్ష్మిదివ్యవ కోకిల, ఆమె కుమారుడు శివ, రామచంద్రాపురానికి చెందిన గొట్టి వెంకటకృష్ణ రూ.లక్ష లతీసుకుని తనను నాలుగు నెలల క్రితం బహ్రెయిన్‌కు పంపారని పి.గన్నవరం(P.gannavaram) మండలం నాగుల్లంకకు చెందిన గుబ్బల కుమారి ఈ వీడియోలో తెలిపింది. నెలకు రూ.30 వేల జీవం ఇస్తారని, ఓ చిన్న ఇంట్లో తక్కువగా పని ఉంటుందని నమ్మించారు.

    అక్కడ పరిస్థితి మరోలా..
    అయితే అక్కడకు వెళ్లాక పరిస్థితి మరోలా ఉంది. మూడు అంతస్తుల బిల్డింగ్‌లో 30 మందికి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని బాధితురాలు తెలిపింది. పని భారం పెరగడంతో ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని కన్నీరు పెట్టుకుంది. కనీసం చికిత్స కూడా చేయించడం లేదని, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని తెలిపింది. ఇక్కడ ఉండలేనని, చిన్న ఇంటిలో పనికి కుదర్చాలని, లేదంటే స్వగ్రామానికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఏజెంట్లకు మొర పెట్టుకుంది. అయితే అందుకు మరో రూ.లక్ష అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

    సీఎం, డిప్యూటీ సీఎంకు వినతి..
    ఇదిలా ఉంటే కుమారి భర్త వీర్రాఘవులు మాట్లాడుతూ తన భార్యను స్వగ్రామానికి తీసుకురావాలని కోరాడు. ఈమేరకు సీఎం చంద్రబాబునాయుడు(Chanrababu nayudu), డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌(Pavan kalyan)కు విజ్ఞప్తి చేశాడు. ఏజెంట్ల మోసంతోపాటు, తన భార్య పడుతున్న ఇబ్బందులపై అమలాపూరం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశానని తెలిపాడు. ఆదుకోవాలని వేడుకున్నాడు.