https://oktelugu.com/

Visakhapatnam Railway Zone: విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్.. బిజెపి పెద్దల బాధ అదే!

విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించింది కేంద్రం. కానీ ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తుండడంతో ఆందోళనతో ఉంది.

Written By: , Updated On : February 11, 2025 / 11:49 AM IST
Visakhapatnam Railway Zone

Visakhapatnam Railway Zone

Follow us on

Visakhapatnam Railway Zone: విశాఖకు ( Visakhapatnam)వరుసగా వరాలజల్లు కురిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరాంధ్రలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. మొన్న ఆ మధ్యన విశాఖకు వచ్చారు ప్రధాని మోదీ. ఏకంగా రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పనిలో పనిగా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి సైతం శంకుస్థాపన చేశారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఏకంగా 11400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే ఇంత చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్ల అంతగా సానుకూలత రావడం లేదు. పైగా ప్రతికూలత వచ్చేలా నిరసన కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో బీజేపీ తలలు పట్టుకుంటుంది. ఇంతకంటే ఏం మేలు చేయాలని ప్రశ్నిస్తోంది. ఇంతటి భారీ స్థాయిలో కేటాయింపులు చేసిన సానుకూలత రాకపోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

* కార్మికుల నిరసన
గత కొద్ది రోజులుగా విశాఖ స్టీల్ ( Visakha Steel )ఉద్యమం నడుస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ను ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. అది మొదలు ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 11400 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించింది. అయితే తమకు ప్యాకేజీ కాదని.. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయమని ప్రత్యేక ప్రకటన విడుదల చేయాలని కోరుతున్నారు ఉద్యోగ, కార్మిక వర్గాలు. అలాగే విశాఖ స్టీల్ కు సొంత గనులు కేటాయించాలని… స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్రం నుంచి సానుకూలత రాకపోవడంతో ఉద్యోగులతో పాటు కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

* కేంద్రం తాజా నిర్ణయం
మరోవైపు విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్( special railway zone) కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. వాల్తేరు డివిజన్ ను విశాఖ డివిజన్ గా పేరు మార్చుతూ ప్రత్యేక జోన్ లో చేర్చారు. ఈ జోన్ కు ఉత్తర కోస్తా మధ్య రైల్వే జోన్ గా పేరు పెట్టారు. అయితే డివిజన్ పరిధిని మార్చడం పై మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కేకే లైన్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేకే లైన్ పరిధిలో అరకు రైల్వే స్టేషన్ ఉంది. ఈ మార్గంలో ఏడాదికి పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దానిని వాల్తేర్ డివిజన్ నుంచి తీసి వేసి రాయగడ డివిజన్లో కలపడం పై పెద్ద ఎత్తున నిరసన స్వరం వినిపిస్తోంది. దీంతో రైల్వే జోన్ ఇచ్చినా ఈ అసంతృప్తి స్వరం ఏమిటని బిజెపి ఆందోళనతో ఉంది.

* కేకే లైన్ విషయంలో
కీలకమైన కొత్తవలస- కిరోండాల్ లైన్ ను( KK line) విశాఖ జోన్లో చేర్చాలని డిమాండ్ పెరుగుతోంది. ఇదే విషయంపై అరకు ఎంపీ కేంద్రానికి లేఖ రాశారు. కేకే లైన్ ను విశాఖ డివిజన్ తో పాటు ఉత్తర కోస్తా మధ్య రైల్వే జోన్ లో చేర్చాలని అందులో పేర్కొన్నారు. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సైతం స్పందించారు. కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయితే విశాఖ తో పాటు ఉత్తరాంధ్రకు ఇంత భారీగా కేటాయింపులు చేస్తున్నా.. ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి రావడం లేదని బిజెపి పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే ఏం చేయలేమని కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.