Telugu Print Media : తెలుగు నాట టాప్ పత్రికలలో అది ఒకటి. ఏ వార్తనైనా సరే ముందూ వెనకా చూడకుండా బొంబాట్ గా ప్రచురిస్తుంది. ఆ పత్రికలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సుప్రసిద్ధ జర్నలిస్టు పుష్కర కాలం కంటే క్రితం నుంచే పని చేస్తున్నారు.. వృత్తి విషయంలో ఆయనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు.. ఆ సంస్థలో ఆయన చాలా కీలక స్థానంలో ఉన్నారు. ఆ సంస్థ ఎండీకి కూడా అత్యంత దగ్గరైన వ్యక్తిగా పేరుపొందారు. ఇటీవల ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు పనిచేస్తున్న పత్రికలో ఎడిటర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వార్త ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఇటీవల అది నిజమైంది. దీంతో ఆ స్థానంలో ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు కూర్చుంటారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగా ఇటీవల ఆయన ఆ పత్రిక ఎండీతో కలిసి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. దీంతో అందరూ ఆయనే కాబోయే ఎడిటర్ అని ఒక అంచనాకు వచ్చారు. ఇక పలు సైట్లు అయితే ఆయనే ఆ పత్రికకు ఎడిటర్ అని తీర్మానించాయి. ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు కూడా దాదాపుగా తనే కాబోయే ఎడిటర్ అని అనుకున్నాడు. కానీ ఈలోగా ఒక ఉపద్రవం చోటుచేసుకుంది. అది కాస్త ఆయన ఎడిటర్ పోస్టును ఊస్ట్ చేసింది.
పెనం నుంచి పొయ్యిలో పడ్డాడు
గతంలో ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు ఓ పత్రికలో పని చేశారు. అక్కడ అసిస్టెంట్ ఎడిటర్ వేధింపులు తట్టుకోలేక బయటకు వచ్చారు. గతంలో ఎవరి చేతిలోనైతే ఆయన వేధింపులు ఎదుర్కొన్నారో.. ఇప్పుడు ఆయనే ప్రస్తుతం ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు పనిచేస్తున్న పత్రికకు ఎడిటర్ కాబోతున్నారు. దీంతో పగోడే పైనుండే పరిస్థితి దాపురించింది. ఈ పరిణామం పెనం నుంచి పోయిలో పడ్డట్టుగా మారింది.
అడ్డగోలుగా తొలగించాడు
కరోనా సమయంలో ఎడిటోరియల్ విభాగంలో రాత్రిపూట పనిచేసే సబ్ ఎడిటర్లను సుపీరియర్ హోదాలో సదరు సుప్రసిద్ధ జర్నలిస్టు అడ్డగోలుగా తొలగించాడు. ఆ బాధ్యతను ఆయా జిల్లాల ఎడిషన్ ఇన్ ఛార్జ్ లకు అప్పగించాడు. అసలే కోవిడ్ సమయం.. బయటి పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్న కాలం.. అలాంటి సందర్భంలో ఉద్యోగాలు కోల్పోయి చాలామంది ఇబ్బంది పడ్డారు. నాడు ఉద్యోగాలు కోల్పోయిన ఎడిటోరియల్ సిబ్బంది ఫోన్ చేస్తే సదరు సదరు సుప్రసిద్ధ జర్నలిస్టు ఎత్తి దారుణంగా మాట్లాడాడు. అసలే ఉద్యోగాలు పోయి బాధలో ఉన్నవారు.. ఆయన అన్న మాటలకు మరింత ఆవేదనలో కురుకుపోయారు. ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు తన పని చేస్తున్న పత్రికలో చాలావరకు జిల్లాలకు ఎడిషన్ ఇన్ ఛార్జ్ లుగా తన వాళ్ళనే నియమించుకున్నాడు. అంతటి కోవిడ్ సమయంలో సబ్ ఎడిటర్లను తొలగించిన సుప్రసిద్ధ జర్నలిస్టు.. ఎడిషన్ ఇన్ ఛార్జ్ ల జోలికి మాత్రం అస్సలు పోలేదు.
నోటి దూల ఎక్కువ
వృత్తితోపాటు వాగాడంబరంలో ఆయనకు ఆయనే సాటి. సామాజిక మాధ్యమాలలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. పిచ్చిపిచ్చిగా విమర్శలు చేస్తుంటారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వాక్ స్వాతంత్రం అని చెబుతుంటారు. ఇవన్నీ అవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టే ఎడిటర్ పోస్ట్ కు సరిపోడని భావించి మేనేజ్మెంట్ దూరం పెట్టిందట. ఇదే విషయాన్ని ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవల ముఖం మీద చెప్పేశారట. అంతకుముందు ఆ మేనేజింగ్ డైరెక్టర్ కోడలు కూడా సదరు సుప్రసిద్ధ జర్నలిస్టుకు చివాట్లు పెట్టిందట. ఎందుకంటే ఆయన ఎక్కువ సమయం ఫేస్ బుక్ లోనే గడుపుతుండడం.. వివాదాస్పద అంశాలను గెలుకుతుండడం.. వంటివి ఆమె దృష్టికి వచ్చాయట. దీంతో ఆ మధ్య జరిగిన బోర్డు డైరెక్టర్ల మీటింగ్ లో సదరు సుప్రసిద్ధ జర్నలిస్టుకు క్లాస్ తీసుకుందట. దీంతో ఆయన ఆఫీస్ టైంలో ఫేస్ బుక్ చూడటం మానేశారట. చివరికి వాట్సప్ చాటింగ్ పై కూడా నిబంధనలను విధించారట. అయితే ఇవన్నీ తట్టుకొని ఆయన ఉన్నది ఎందుకంటే.. కేవలం ఎడిటర్ పోస్ట్ కోసం మాత్రమే. ఎందుకంటే ఆయనతోపాటు జర్నలిజంలో ఓనమాలు దిద్దిన వారంతా ఎడిటర్లు అయిపోయారు. కానీ ఈయన మాత్రం అక్కడే ఉండిపోయారు. స్థూలంగా చెప్పాలంటే ఆయనకున్న అవ లక్షణాలే ఆయనను స్థానభ్రంశం చెందించకుండా ఉంచుతున్నాయి.
వందల మందిని రోడ్డు మీద పడేశాడు
వందల మందిని రోడ్డునపడేసిన ఈ అసిస్టెంట్ ఎడిటర్.. ఏనాడు ఉద్యోగుల సంక్షేమం, వారి అవసరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు అవే ఆయనకు అగ్రతాంబూలం దక్కే విషయంలో అడ్డుపడ్డాయి. గతంలో ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవే మైనస్ గా మారాయి. ఈయనకు బాధితుల కడుపుకోత గట్టిగానే తగిలింది. ఈయన వ్యవహారాలు ఈనాటికి మేనేజ్ మెంట్ కు తెలిసాయి.. పాపం పండింది.. అసలు ఎడిటర్ పోస్ట్ కు ఈయన్ను దూరం చేసింది. ఇప్పుడు తదుపరి ఎడిటర్ నేనే అని విర్రవీగిన ఈయన పరిస్తితి కుడిదలో పడ్డ ఎలుకలా మారింది.. యజమానే వెంట తిప్పుకొని అసలు పోస్ట్ విషయం వచ్చేసరికి కూరలో కరివేపాకులా తీసివేయడంతో కక్కలేక మింగలేక నెత్తినోరు బాదేసుకుంటున్నారట.. సన్నిహితుల వద్ద చెప్పుకొని బోరున ఏడ్చేస్తున్నాట.. ఈ విషయం ఆనోట ఈనోట బయటపడడంతో ప్రస్తుతం ప్రింట్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.