https://oktelugu.com/

Viral Video : ఆకాశంలో ఆశల హరివిల్లు.. వీళ్ళకోసమే ఈ పాట పుట్టిందేమో..ఈ తల్లి కూతుళ్లు నెమళ్లను మించిపోయారు.. వైరల్ వీడియో

ఎంతసేపు ఆడవాళ్లను వంటింటి కుందేళ్లుగా.. సీరియళ్లు చూసే అతివలు గానే మన సమాజం ముద్రవేసింది. అఫ్కోర్స్ ఇప్పుడు కాస్త నయం. ఒకప్పుడు ఇంతకంటే దారుణంగా ఉండేది. కాకపోతే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన తీరు కొంతకాలంతో పోల్చితే మెరుగ్గా ఉంది కాబట్టి ఆడవాళ్లు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు. దానికి నిదర్శనంగానే అనకాపల్లి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 9, 2024 / 12:20 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video :  ఆమె వయసు ఓ 40 సంవత్సరాలు దాకా ఉంటుంది. పెళ్లయింది.. ఇద్దరు ఆడపిల్లలు.. మోడ్రన్ మదర్ గా ఉంటూనే తన పిల్లలతో కలిసి ఆమె డాన్స్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో రీల్స్ లో సందడి చేస్తూ ఉంటుంది. ఇంటి బాధ్యతలు ఊపిరి సలపకుండా చేస్తున్నప్పటికీ.. కాస్తలో కాస్త సమయం పిల్లలకు కేటాయిస్తోంది. వారితో సరదాగా గడుపుతోంది. చదువులను పర్యవేక్షిస్తూనే.. వారితో మరింత అనుబంధాన్ని పెన వేసుకుంటుంది. అందువల్లే ఆ పిల్లలు ఆమెను తమ తల్లిగా కాకుండా స్నేహితురాలిగా భావిస్తుంటారు. ఆమెతో ప్రతి విషయం చెప్పుకుంటారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడంతో ఆమె తన పిల్లల్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నది. అయినప్పటికీ వారు చదువుల్లో మెరికలు. సాంస్కృతిక కార్యక్రమాలలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రతి విషయంలోనూ తమ వంతు భాగస్వామ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అందువల్లే ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు స్కూల్ లో టాపర్లు గా కొనసాగుతున్నారు.. అయితే ఇటీవల ఆ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో తల్లి కూతుర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆకాశంలో ఆశల హరివిల్లు అనే పాటకు అద్భుతంగా డ్యాన్స్ వేశారు.

    నెమళ్ళ మాదిరిగా..

    పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఆ తల్లి కూతుళ్లు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. స్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆహూతులను అలరించారు. స్వర్ణకమలం సినిమాలో ఆకాశంలో ఆశల హరివిల్లు అనే పాటకు ఆ తల్లి కూతుళ్లు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఆ తల్లి ముందుగా వచ్చి తన పాదాలతో ఆ పాటకు తగ్గట్టుగా నర్తిస్తుంటే.. వెనుక ఉన్న ఇద్దరు కూతుళ్లు లయబద్ధంగా స్టెప్పులు వేశారు. ఆ తర్వాత తల్లి వెనక్కి వెళ్ళగా..ఆ ఇద్దరు కూతుళ్లు ముందుకు వచ్చి శాస్త్రీయ నృత్యం చేశారు. నెమళ్ళ మాదిరిగా కాళ్లను కదుపుతూ చూస్తున్న వారికి సరికొత్త ఆనందాన్నిచ్చారు. ఆ వేదికను నిజంగానే హరివిల్లు లాగా మార్చారు. పాట ప్రారంభం నుంచి మొదలుపెడితే చివరి వరకు ఒకే తీరుగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. దీనిని ఆ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ ఫోన్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త ఒక్కసారి గా చర్చనీయాంశంగా మారింది. “అద్భుతం.. అనన్య సామాన్యం.. చూడ్డానికి కనుల విందుగా ఉంది. ఇలాంటి ప్రతిభను బయటి ప్రపంచానికి పరిచయం చేయాలి. అప్పుడే ఇంకా చాలామంది వెలుగులోకి వస్తారు. ఆ తల్లి కూతుళ్ల డ్యాన్స్ నయానందకరంగా ఉందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.